మోడీకి వ్యతిరేకంగా నవీన్ పట్నాయక్ గళం.. తొలిసారి సంచలన వ్యాఖ్యలు

by Dishanational6 |
మోడీకి వ్యతిరేకంగా నవీన్ పట్నాయక్ గళం.. తొలిసారి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఒడిశా ముఖ్యమంత్రి, బిజు జనతాదళ్ చీఫ్ నవీన్ పట్నాయక్ ప్రధాని మోడీపై విరుచుకు పడ్డారు. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని మోడీ అన్న వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మోడీ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఒడిశాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న ప్రధాని వ్యాఖ్యలపై నవీన్ పట్నాయక్ స్పందించారు. బీజేపీ చాలారోజులుగా పగటి కలలు కంటోందని విమర్శించారు.

ఒడిశాలోనూ రాబోయేది డబుల్‌ ఇంజిన్‌ సర్కారేనని, జూన్‌లో జరగబోయే బీజేపీ సీఎం ప్రమాణ స్వీకారానికి తాను వస్తానంటూ ప్రధాని మోడీ అన్నారు. బెహ్రాంపూర్‌ గాంజాంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన నేరుగానే నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వంపై విసుర్లు విసిరారు.

ఒడిషాను కాంగ్రెస్‌.. ఆ తర్వాత బిజు జనతా దళ్‌ 70 ఏళ్లపాటు దోచుకున్నాయి. ఒడిశాలో అన్ని వనరులు ఉన్నప్పటికీ ఇంకా పేదరికంలోనే మగ్గుతోందని.. అందుకు కారణం ఏంటి అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేడీ నేతల దోపిడీయే దీనికి కారణం అని అన్నారు. ఒడిశాకు ఒడియా భాష, సంస్కృతి అర్థం చేసుకునే సీఎం కావాలని.. పరోక్షంగా నవీన్ పట్నాయక్ ని ఉద్దేశించి విమర్శుల చేశారు.

ఒడిషా ప్రజలు ఆలోచనతో బీజేపీకి ఓటేయాలని పిలుపునిచ్చారు. జూన్‌ 4వ తేదీ బీజేడీ ప్రభుత్వానికి ఆఖరి తేదీ అని నొక్కిచెప్పారు. బీజేపీ సీఎం ప్రమాస్వీకారానికి తానొస్తానని అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ఒడిషా యూనిట్‌పై, అది రూపొందించిన మేనిఫెస్టోపై మోడీ ప్రశంసలు గుప్పించారు.ఇకపోతే, మే 13వ తేదీన నాలుగో దశ పోలింగ్‌లో ఒడిషాలోని 21 లోక్‌సభ సీట్లతో పాటు ఆ రాష్ట్ర అసెంబ్లీ 147 స్థానాలకు పోలింగ్‌ జరగనుంది.

Next Story

Most Viewed