- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్ వాసుల పార్కింగ్ కష్టాలకు చెక్… సరికొత్త ప్రాజెక్టుపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
దిశ, డైనమిక్ బ్యూరో:హైదరాబాద్ నగర వాసులను నిత్యం వేధిస్తున్న వాహనాల పార్కింగ్ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం తలపెట్టిన పూర్తి ఆటోమేటెడ్, కంప్యూటరైజ్డ్ మల్టీ లెవల్ కార్ పార్కింగ్ (ఎంఎల్ పీ) కాంప్లెక్స్ పనులు దాదాపు పూర్తి కొవొచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. 2016/17లో నాంపల్లి మెట్రో స్టేషన్ సమీపంలో పీపీపీ విధానంలో ఈ ఎంఎల్ సీపీ ప్రాజెక్టును ప్రారంభించామని కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అయినా ఎట్టకేలకు పూర్తి కావచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ బిల్డింగ్ నిర్మాణ ఫోటోలను షేర్ చేస్తూ.. ఇటువంటి మల్టీ లెవల్ కార్ పార్కింగ్ విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మరింత ముందుకు తీసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మేము అనుకున్నట్లుగా కీలకమైన జంక్షన్లు, మెట్రో స్టేషన్లు, వాణిజ్య కేంద్రాలలో మరిన్ని ఎంఎల్సీపీలను ఏర్పాటు చేయాలని కోరారు.
కాగా, హైదరాబాద్ నగర వాసులను వేధిస్తున్న పార్కింగ్ సమస్యను అధిగమించేందుకు నాంపల్లి మెట్రో రైల్ స్టేషన్ సమీపంలో ఉన్న హెచ్ఎంఆర్ కు చెందిన అర ఎకరం స్థలంలో 15 అంతస్తులలో ఈ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు. ఇందులో 10 అంతస్తుల్లో వాహనాల పార్కింగ్ సౌకర్యం మరో ఐదు అంతస్తుల్లో కమర్షియల్ షాపులు, రెండు స్క్రీన్ లతో కూడిన థియేటర్ కూడా నిర్మిస్తున్నారు. పీపీపీ విధానంలో రూ.80 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టుని నిర్మిస్తుండగా అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దేశంలోనే తొలిసారిగా జర్మన్ పాలిస్ పార్కింగ్ విధానంలో, తక్కువ స్థలంలో ఎక్కువ వాహనాలు పార్కింగ్ చేసేలా ఈ ప్రాజెక్టును చేపట్టినట్టు గతంలో మెట్రో ఎండీ వివరించారు.