- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు తప్పిన ప్రమాదం
దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఎండ వేడి కాల్చేస్తుంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షం పడుతోంది. సోమవారం ఓడిసా రాజధానిలో సైతం తీవ్రమైన గాలివాన బీభత్సం సృష్టించింది. ప్రతికూల వాతావరణం, బలమైన గాలుల కారణంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణించే హెలికాప్టర్ భువనేశ్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేసేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం ఖరియాన్ నుంచి తిరిగొచ్చిన సీఎం నవీన్ పట్నాయక్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్ చేసేందుకు సాధ్యం కాలేదు. దీంతో భువనేశ్వర్ విమానాశ్రయంపై సుమారు 30 నిమిషాల పాటు తిరుగుతూ అక్కడి నుంచి జార్సుగూడలో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. సీఎం నవీన్ పట్నాయక్‌తో పాటు సీనియర్ బీజేడీ నేత వీకే పాండియన్ కూడా హెలికాప్టర్‌లో ఉన్నారు. ఈ ఘటనతో పార్టీ నేతలు ఒక్కసారిగా భయాందోళణకు గురయ్యారు.