- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Trending: తాగునీటి సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న బెంగళూరు.. కోతి చేసిన పనికి అవాక్కైన నెటిజన్లు
దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరులో ప్రస్తుతం తాగునీటి సమస్య తాండవం చేస్తోంది. ఇప్పటికే పలు సాఫ్ట్‌వేర్ కంపెనీలు వర్క్ ఫ్రం హోంను మళ్లీ తీసుకొచ్చే పరిస్థితులు నెలకొన్నాయి. ఇక అపార్ట్‌మెంట్లు, విల్లాల్లో నీల్లు అందబాటులో లేవంటూ నోటీసు బోర్డులు పెడుతున్నారు. అదేవిధంగా ఎండను తట్టుకోలేక కొన్ని సాదు జంతువులు కూడా మృత్యువాత పడుతున్నాయి. ఈ క్రమంలోనే బెంగళూరు సిటీలో ఓ ఇంట్లోని కిచెన్‌లోక కోతి చొరబడింది. వచ్చి రాగానే అదే తన దాహం తీర్చుకునేందుకు వాటర్ ప్యూరిఫైయర్ దగ్గరికి వెళ్లింది. ఏకంగా కుళాయికి నోటి పెట్టి నీళ్లను తాగేందుకు ప్రయత్నించింది. పక్కనే ఉన్న మరో కోతి తన వంతు కోసం కిటికీలో కూర్చొని వేచి చూస్తోంది. అయితే, ఈ మొత్తం తతంగాన్ని అక్షత్ అనే నెటిజన్ వీడియో తీసి తన X (టిట్టర్) ఖాతాలో ‘బెంగుళూరు నీటి సంక్షోభం మనుషుల కంటే జంతువులను తీవ్రంగా దెబ్బతీసింది. వాటికి కూడా సాయం చేసేందుకు నీటిని పొదుపు చేద్దాం.’ అనే క్యాప్షన్ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.