- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒమిక్రాన్ డేంజర్.. రాజధానిలో నైట్ కర్ఫ్యూ
దిశ, డైనమిక్ బ్యూరో : కరోనా న్యూ వేరియంట్ ఒమిక్రాన్ చాప కింద నీరులా వ్యాప్తి చెందుతోంది. దీని నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ప్రజలు సాధారణ జీవితానికి అలవాటు అవుతున్న వేళ తిరిగి ఆంక్షలు విధించడంతో మూతికి మాస్క్ వేసుకోవడమే ప్రథమ విధిగా భావిస్తున్నారు. ఈ క్రమంలో దేశంలోని అనేక రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ విధించడంతోపాటు సభలు, ర్యాలీలపై ఆంక్షలు పెడుతూ వైరస్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నాయి.
తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ విధించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అంతేకాకుండా, కఠిన ఆంక్షలు విధించేందుకు కేజ్రివాల్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా ఢిల్లీలోని మెట్రో రైలు, బార్లు, ప్రైవేటు ఆఫీసులు 50శాతం ఆక్యుపెన్సీతో పనిచేస్తాయి. వైరస్ వ్యాప్తి అధికంగా ఉండే స్కూల్స్, కాలేజీలు, థియేటర్లు మూసివేస్తారు. అంతేకాకుండా, పెళ్లి, అంత్యక్రియలకు కేవలం 20 మంది మాత్రమే హాజరుకావాల్సి ఉంటుంది.