- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అటవీ శాఖలో వింత.. గోల్ మాల్ గోవిందం
దిశ ప్రతినిధి, కరీంనగర్: జోనల్ వ్యవస్థ ఏర్పాటుతో అన్ని శాఖల్లో స్థాన చలనాలు తప్పడం లేదు. అటవీ శాఖలో కూడా ఇదే పద్దతిన బదిలీలకు శ్రీకారం చుట్టారు అధికారులు. అయితే సీనియారిటీ జాబితా తయారు చేయడంలో మాత్రం నిభందనలు పాటించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజన్న జోన్ లో చోటు చేసుకున్న ఈ వింత ఘటనపై అటవీశాఖ వర్గాలు ముక్కున వేలుసుకుంటున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిన విధంగా కాకుండా ఇష్టం వచ్చిన రీతిలో జాబితా తయారు చేయడం ఏంటన్న చర్చ సాగుతోంది. 371 జీఓ ప్రకారం సీనియారిటీ జాబితా సిద్దం చేయాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ ఆ తరువాత రోస్టర్ విధానాంతో మాత్రమే పంపాలని ఆదేశించింది.
ఇందులో భాగంగా 15 శాతం ఎస్సీలు, 6 శాతం ఎస్టీలకు ప్రాధాన్యత కల్పించాలని దిశా నిర్దేశం చేసింది. అయితే రాజన్న జోన్ లోని కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలో ఈ విధానానికి మంగళం పాడినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. రాజన్న జోన్ కు 34 డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ పోస్టులు అలాట్ కాగా కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలకు 7 కెటాయించారు. ఇందులో రోస్టర్ పద్ధతిన ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన అధికారులకు ప్రాధాన్యత కల్పించాలన్న నిబంధనలను తుంగలోకి తొక్కినట్టు అటవీ శాఖ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఏడు పోస్టుల్లో మూడు ఓసీలకు, రెండు మెడికల్ గ్రౌండ్స్ కింద, రెండు ఎస్టీలకు కెటాయించి వారి పేర్లతో కూడా జాబితా సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇందులో ఎస్సీలకు అవకాశం ఇవ్వకపోవడం పట్ల అటవీశాఖ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.
చేరిన తరువాతే…
అయితే ఇలాంటి తప్పిదాలపై అప్పీల్ చేసుకోవడంతోపాటు కోర్టును ఆశ్రయించే అవకాశాన్ని కూడా కల్పించారు. కానీ అందులో సూచించిన మేరకు అప్పీల్ చేసుకోవడం వల్ల తమ సమస్య పరిష్కారం అయ్యే అవకాశాలు లేవన్న అభిప్రాయాలు ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యక్తం అవుతున్నాయి. తప్పిదాలతో తయారు చేసిన జాబితా ప్రకారమే బదిలీ చేసిన చోట జాయిన్ అయిన తరువాత అప్పీల్ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. దీనివల్ల తమ సమస్య పరిష్కారం కాదని, ఎవరి విధుల్లో వారు చేరిన తరువాత బదిలీలు రద్దు చేసి ఉద్యోగుల ఆప్షన్ మేరకు కానీ, తప్పిదాలను సవరించే అవకాశం కానీ ఉండడం కష్టమేనని అంటున్నారు. విధుల్లో చేరిన తరువాత తాము అక్కడి నుండి కదిలేది లేదని అన్నా, కోర్టును ఆశ్రయించినా తాము చేసేదేమీ ఉండదని అంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి 28 వేలకు పైగా అప్పీల్ దరఖాస్తులు వెల్లడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే వాస్తవంగా నష్టపోతున్నవారికి మాత్రం న్యాయం జరిగేలా లేదన్న వేదన ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యక్తం అవుతోంది.