అనన్య తెలుగుసీమకు.. లవర్‌బాయ్ అన్యసీమకు!

by Shyam |
అనన్య తెలుగుసీమకు.. లవర్‌బాయ్ అన్యసీమకు!
X

దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో విజయ్ ఫైటర్‌గా కనిపిస్తుండగా… హీరోయిన్‌గా అనన్యపాండే నటిస్తోంది. ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది టీం. కరణ్ జోహార్, చార్మి, అపూర్వ మెహతా నిర్మిస్తున్న ఈ సినిమాతో అనన్య పాండే సౌత్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుండగా విజయ్ బాలీవుడ్‌కు ఎంటర్ అవుతున్నాడు.

చిత్రం ఫస్ట్ షెడ్యూల్ ముంబైలో ఇప్పటికే పూర్తి కాగా, సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్‌లో స్టార్ట్ అయింది. ఈ షెడ్యూల్‌లో టీంతో జాయిన్ అయిన అనన్య పాండే.. ఈ సినిమాలో నటిస్తున్నందుకు సంతోషంగా ఉందని తెలిపింది. విజయ్ దేవరకొండను బాలీవుడ్‌కు ఆహ్వానిస్తూ ట్వీట్ చేసింది. సెకండ్ షెడ్యూల్‌ సెట్స్‌ నుంచి విజయ్, అనన్య, పూరీ, చార్మిల ఫొటోలను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. సినిమాకు ఫైటర్ లేదా లైగర్ టైటిల్స్ పరిశీలనలో ఉంది. రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో కనిపించనున్నారట.

Advertisement

Next Story