- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇది కలా.. నిజమా? : ధృవ్
చియాన్ విక్రమ్ ఫ్యాన్స్ పండగ చేసుకునే న్యూస్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. తండ్రి విక్రమ్‌తో కలిసి ధృవ్ నటిస్తున్నాడన్న వార్తలను నిజం చేస్తూ వర్కింగ్ స్టిల్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. చియాన్ 60లో విక్రమ్, ధృవ్ కలిసి నటిస్తున్నట్లు కోలీవుడ్ మీడియా చేసిన ప్రచారం కాస్త నిజం కావడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను 7 స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై లలిత్ కుమార్ నిర్మిస్తుండగా అనిరుధ్ రవిచంద్రన్ స్వరాలు సమకూరుస్తున్నాడు. గ్యాంగ్ వార్ నేపథ్యంలో సాగే కథలో తండ్రి వారసత్వాన్ని కొడుకు కొనసాగిస్తాడని తెలుస్తుండగా రక్తంతో తడిచిన తండ్రి చేతుల నుంచి కొడుకు గన్‌ను తీసుకునే పోస్టర్ ఆకట్టుకుంటోంది.
ధృవ్ విక్రమ్‌కు ఇది రెండో సినిమానే కాగా.. ఇంత తొందరగా తండ్రితో పూర్తిస్థాయిలో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వరించడంపై సంతోషం వ్యక్తం చేశాడు. ‘కార్తీక్ సుబ్బరాజ్ సినిమాలు చూసేందుకు ఎప్పుడూ ఎగ్జయిటింగ్‌గా ఉంటానని, నా ప్లే లిస్ట్‌లో అనిరుధ్ ఆల్బమ్ సాంగ్స్ ఎప్పుడూ ప్లే అవుతూనే ఉంటాయని, మా డాడీకి నేనెప్పుడూ బిగ్గెస్ట్ ఫ్యాన్’ అని చెప్తున్న ధృవ్.. ఇంతమంది ఫేవరెట్స్ ఒకేసారి తనతో కలిసి పనిచేయడాన్ని నమ్మలేకపోతున్నాడట. ‘ఇది గనుక కల అయితే.. ప్లీజ్ నన్ను లేపొద్దు’ అని చెప్తూ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి ఎంత ఎగ్జయిటింగ్‌గా ఫీల్ అవుతున్నాడో చెప్పాడు ధృవ్.
https://www.instagram.com/p/CBLCdkZnY_c/?utm_source=ig_web_copy_link