బాలయ్య 107వ చిత్రం టైటిల్‌పై మేకర్స్ అనౌన్స్‌మెంట్

by Shyam |
NBK107
X

దిశ, సినిమా : నట సింహం నందమూరి బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రంపై రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ.. బాలయ్య 107వ చిత్రం కాగా, టైటిల్‌పై డిస్కషన్ జరుగుతోంది. ఈ క్రమంలో మేకర్స్ క్లారిటీ ఇస్తూ నోట్ రిలీజ్ చేశారు. #NBK107 టైటిల్ ఫిక్స్ అయిందని వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపారు. టైమ్ వచ్చినప్పుడు టైటిల్‌తో పాటు అన్ని వివరాలు ప్రకటిస్తామన్న మేకర్స్.. ఇలాంటి అబద్ధాలు ప్రచారం కావడం బాధగా ఉందన్నారు. కాగా ప్రస్తుతం బాలయ్య – బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న ‘అఖండ’ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు అభిమానులు.

Advertisement

Next Story