ఔషధాల అమ్మకంపై అధికారుల దృష్టి

by Shyam |

దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ ప్రాంతంలోని ఔషధ విక్రయాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్టు సంబంధిత శాఖ అధికారులు తెలిపారు. కరోనా వ్యాధి పాజిటివ్ సూచనలు గల వారిని తేలికగా గుర్తించేందుకు పట్టణ పరిసర ప్రాంతాల్లో గల అన్ని మెడికల్ షాపుల్లో ఫీవర్ సర్వే లైన్స్‌ లోకి తీసుకువస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఔషధ నియంత్రణ మండలి అధికారులు తెలిపారు. మెడికల్ షాపుల్లో జ్వరం, గొంతునొప్పి టాబ్లెట్లు కొనుగోలు చేసే వారి వివరాలను సేకరించాలని అధికారులు సంబంధిత మెడికల్ షాపుల యజమానులు కూడా సూచించినట్టు తెలిసింది. ఔషధాలను విక్రయించే మెడికల్ షాపుల యజమానులు వృక్షం లేకుండానే మాత్రలు ఇవ్వకుండా ఉంటే కరోనా వ్యాధి వ్యాప్తి నివారించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అన్నారు.

Tags : Officers, focus, sale, drugs, medakm medical shops, feaver

Advertisement

Next Story

Most Viewed