- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
స్థూలకాయులకు కరోనా రిస్క్?
భారతదేశంలో స్థూలకాయంతో బాధపడుతున్నవారికి కొవిడ్ 19 వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. ఢిల్లీలో అపోలో హాస్పిటల్ వారు చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. దాదాపు 1000 మంది కొవిడ్ 19 పేషెంట్లలో 70 శాతం మంది స్థూలకాయంతో బాధపడుతున్నారని తేలింది. అయితే ఈ అధ్యయనం ఫలితాలు అధికారికంగా ఎందులోనూ ప్రచురితం కాలేదు కానీ, ఇది నిరూపితమైన సత్యమని డాక్టర్ సుమిత్ రే అంటున్నారు. సాధారణంగా ఒబెసిటీ అనేది ఎన్నో జబ్బులకు దారితీస్తుంది. అలాంటి వాళ్లకు కొవిడ్ 19 వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ. అయితే చనిపోయిన వారిలో 82 శాతం మంది ఒబెసిటీ సమస్య ఉన్నవారేనని డాక్టర్ అరుణ్ ప్రసాద్ చెబుతున్నారు. అయితే ఇందుకు మూడు కారణాలు ఉన్నాయి.
స్థూలకాయులకు ఇప్పటికే శ్వాస సమస్య ఉండటం..
వారి శరీర అనియంత్రిత వృద్ధి కారణంగా శ్వాస కండరాలు బిగుసుకు పోయి, గాలి పీల్చుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. వారి శరీర పరిమాణంతో పోలిస్తే ఊపిరితిత్తుల పరిమాణం చాలా చిన్నగా ఉంటుంది. కాబట్టి జీవక్రియ శ్వాసరేటు కూడా తక్కువగా ఉంటుంది. కొవిడ్ 19 ముందుగా శ్వాసవ్యవస్థనే దెబ్బతీస్తుంది కాబట్టి, ఇప్పటికే శ్వాస సమస్యలతో ఇబ్బంది పడుతున్న స్థూలకాయస్తుల ఆరోగ్యాన్ని ఇది మరింత క్షీణింపజేస్తుంది.
వెంటిలేటర్‌లతో ఇబ్బంది..
వెంటిలేటర్ మెకానికల్‌గా స్థూలకాయులకు పెట్టడానికి ఇబ్బందిగా ఉంటుంది. కొవిడ్ 19 మాత్రమే కాదు సాధారణంగా వచ్చే చిన్న చిన్న శ్వాస సమస్యలకైనా ఒబెసిటీ ఉన్నవాళ్లకు వెంటిలేటర్ పెట్టడం కష్టంగా మారుతుంది. కాబట్టి ఒబెసిటీ ఉన్నవారిలో తక్కువ సమయంలోనే పరిస్థితి విషమిస్తుంది. కాబట్టి వాళ్లను వెంటనే ఐసీయూకి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని డాక్టర్ రే అంటున్నారు.
తోడుగా డయాబెటిస్..
దాదాపు ఒబెసిటీ ఉన్నవాళ్లందరికీ డయాబెటిస్ ఉంటుంది. కాబట్టి వారికి ఎలాంటి ట్రీట్‌మెంట్ చేయాలన్నా కూడా ఇబ్బంది ఎదురవుతుంది. డయాబెటిస్‌తో పాటు హైపోథైరాయిడిజం, స్లీప్ ఏప్నియా కలగలిస్తే పరిస్థితి ఇంకా దారుణంగా మారుతుంది. డయాబెటిస్ కారణంగా వ్యాధినిరోధకత తగ్గడం మూలాన కొవిడ్ 19 బలపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి డయాబెటిస్, ఒబెసిటీ లాంటి సమస్యలు ఉన్నవాళ్లు లాక్‌డౌన్ ఉన్నా, లేకపోయినా కొవిడ్ 19 బారిన పడకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.