ఏపీలో 10వేలు దాటిన కరోనా కేసులు

by srinivas |
ఏపీలో 10వేలు దాటిన కరోనా కేసులు
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 10వేలు దాటింది. గడిచిన 24గంటల్లో 497పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 10,331కి చేరింది. ఇవాళ్టి 497కేసుల్లో రాష్ట్రానికి చెందినవారు 448 మందికాగా, ఇతర రాష్ట్రాలు, దేశాలకు చెందిన వారు 49మంది ఉన్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తంగా 10,331 కేసుల్లో 8,306 మంది ఏపీకి చెందినవారు కాగా, 1,661 మంది ఇతర రాష్ట్రాలకు, 364 మంది విదేశాల నుంచి వచ్చినవారు ఉన్నారు. కరోనాతో వివిధ ఆస్పత్రుల్లో 5,423 మంది చికిత్స పొందుతుండగా ఇప్పటివరకు 4,779 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనాతో ఇప్పటివరకు 129మంది మరణించారు.

Advertisement

Next Story