కొవిడ్‌ రోగులకి అండగా న్యూక్లియోనిక్స్ రోబోలు

by vinod kumar |   ( Updated:2020-06-25 08:28:24.0  )
కొవిడ్‌ రోగులకి అండగా న్యూక్లియోనిక్స్ రోబోలు
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా నుంచి రక్షణ పొందే ఉత్పత్తులు రూపొందించిన న్యూక్లియోనిక్స్ సిస్టమ్స్ కంపెనీని మంత్రి ఈటల రాజేందర్‌ అభినందించారు. ఆ సంస్థ అందుబాటులోకి తెచ్చిన పలు ఉత్పత్తులను గురువారం తన నివాసంలో న్యూక్లియోనిక్స్ మేనేజ్‌మెంట్ టీం ఎండీ నరేందర్‌రెడ్డి, డిఫెన్స్ అండ్ ఐటీ డైరెక్టర్ నిషాంత్‌రెడ్డి, టెక్నికల్ డైరెక్టర్ ధీరజ్‌రెడ్డి, పారిశ్రామికవేత్తల సమాఖ్య అధ్యక్షుడు సుధీర్‌రెడ్డితో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 3 దశాబ్దాలుగా రక్షణ రంగానికి అనేక పరికరాలు తయారుచేస్తున్న న్యూక్లియోనిక్స్ కంపెనీ కొవిడ్-19 పై యుద్ధం చేసేందుకు అవసరమైన సామగ్రిని తయారు చేయడం హర్షణీయం అన్నారు. కరోనా సోకిన వారి వద్దకి వెళ్లడానికి కుటుంబ సభ్యులే భయపడుతున్న తరుణంలో రోగుల అవసరాలు తీర్చే రోబోని తయారు చేయడం గొప్ప విషయమన్నారు.

Advertisement

Next Story