తారక్ ఫస్ట్ లుక్‌…చరణ్ వాయిస్ లేదా?

by Shyam |
తారక్ ఫస్ట్ లుక్‌…చరణ్ వాయిస్ లేదా?
X

దిశ, వెబ్‌డెస్క్: దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీంగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న ఈ చిత్రం నుంచి … చెర్రీ పుట్టినరోజున రిలీజైన ‘భీం ఫర్ రామరాజు’ ట్రీట్ మెగా, నందమూరి ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చింది. చరణ్ లుక్‌కు తారక్ వాయిస్ యాడ్ అవడంతో వీడియో వీర లెవల్‌లో క్లిక్ అయింది.

అయితే మే 20న తారక్ బర్త్ డే ఉండడంతో… ‘ఆర్ఆర్ఆర్’ నుంచి భీం ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుందని ఫిల్మ్ నగర్ టాక్. అయితే చరణ్‌ను ఇంట్రడ్యూజ్ చేసేందుకు తారక్ వాయిస్‌ వాడిన జక్కన్న.. ఈ సారి తారక్ ఫస్ట్ లుక్ వీడియో కోసం చెర్రీ వాయిస్ వినియోగిస్తాడని అనుకున్నారు. కానీ అలా కాకుండా… ఏకంగా తారక్ డైలాగ్స్‌, పులితో ఫైట్ సీక్వెన్స్ వీడియోలో ఉంటాయని తెలుస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణ ఇప్పటికే 75శాతం పూర్తి కాగా… తారక్ పాత్రకు సంబంధించిన సన్నివేశాలు దాదాపు పూర్తి కావడమే ఇందుకు కారణం. పైగా వీడియో రిలీజ్ చేసేందుకు ఇంకా టైం ఉండడం కలిసొస్తోంది. కానీ చరణ్‌కు ‘భీం ఫర్ రామరాజు’ ట్రీట్ ఇద్దామని కేవలం వారం రోజుల ముందే ఆలోచన రావడం.. అదే సమయంలో కరోనా కారణంగా లాక్ డౌన్ కావడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయట. అయితే చరణ్‌ను చాలా సింపుల్‌గా ఇంట్రడ్యూజ్ చేసి తారక్‌ ఫస్ట్ లుక్ వీడియోలో డైలాగ్స్, ఫైట్ సీక్వెన్స్ యాడ్ చేస్తే మెగా ఫ్యాన్స్ నొచ్చుకునే ప్రమాదం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నా… సినిమాకు మాత్రం ప్లస్ అవుతుందనే ఆలోచనలో ఉన్నాడట జక్కన్నా. ఒక వేళ ఇదే జరిగితే మెగా ఫ్యాన్స్ కాస్త నిరాశపడ్డ .. నందమూరి ఫ్యాన్స్‌కు పండగే.

Tags: NTR, RRR, SSRajamouli, RamCharan Tej

Advertisement

Next Story