- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒక్క ఫోన్ కాల్.. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో NSUI లీడర్ల కొట్లాట!
దిశ, గోదావరిఖని : నారదాసు పెట్టిన చిచ్చు ఇద్దరి నేతల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఆ ఫోన్ కాల్ అందరికీ సినిమా చూపించింది. దీంతో వారు రోడ్డుకెక్కే పరిస్థితి వచ్చింది. ఆ నేతల మధ్య జరిగిన సంభాషణ ఏమిటి..? ఫోన్ చేసిన నారదాసు ఎవరు..? జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మార్కండేయ కాలనీలోని ఓ ప్రైవేటు పాఠశాలకు NSUIకు సంబంధించిన ఇద్దరు నాయకులు వెళ్లారు.అయితే, సంబంధించిన నారదాసు ప్రిన్సిపాల్ వెంటనే ఓ NSUI నాయకుడికి ఫోన్‌లో సమాచారం అందించడంతో అక్కడికి వెళ్లిన వారి మధ్య మాట మాట పెరగింది. మాట్లాడుకుందామని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.
అప్పటికే పార్టీ ఆఫీస్‌లో కొంత మంది సీనియర్ నాయకులు సైతం అక్కడే ఉన్నారు. వారు అందరూ చూస్తుండగానే ఇద్దరు ఎన్ఎస్‌యూఐ నాయకులు విజయ్ కుమార్, దుర్గా ప్రసాద్‌లు ఘర్షణ పడ్డారు. అయితే, అప్పటికే అక్కడ విజయ్ కుమార్‌తో ఉన్న మరో వ్యక్తితో పాటు మరి కొంత మంది కొట్టుకుంటున్న సమయంలో రాజ్ కుమార్ అనే వ్యక్తి మధ్యలో పోవడంతో కర్రతో దాడి చేయగా చెవి భాగంలో తీవ్ర గాయమై రక్తస్రావం కావడంతో వెంటనే చికిత్స నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, సదరు దాడి చేసిన వ్యక్తి పై గతంలో కూడా ఇలాగే పలు ఆరోపణలు ఉన్నాయి. స్థానిక కాంగ్రెస్ సీనియర్లు పట్టించుకోకపోవడంతో వీరు ఇలా రెచ్చిపోయారు. రెండు గ్రూపులుగా తయారై కొట్టుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ ఘటన రామగుండం మండలంలో చర్చనీయాంశంగా మారింది. ఈ నాయకుల మధ్య నారదాసు ప్రిన్సిపాల్ చేసిన ఫోన్ కాల్ ప్రస్తుతం ఇంకా ఎన్ని వివాదాలకు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే..