- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Attathadde Festival: వాషింగ్టన్ డీసీలో ఘనంగా అట్లతద్దె వేడుకలు.. పెద్దఎత్తున పాల్గొన్న మహిళలు
దిశ, వెబ్‌డెస్క్: అమెరికా(USA)లోని వాషింగ్టన్ డీసీ(Washington DC)లో జీడబ్ల్యూటీసీఎస్(GWTCS) ఫార్మర్ ప్రెసిడెంట్(Farmer President) పాలడుగు సాయిసుధ(Paladuga Saisudha) ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్(AP) రాష్ట్రాన్ని ప్రతిబింబించేలా తొలిసారిగా అట్టతద్దె పండుగ(Attathadde Festival)ను ప్రవాసాంధ్రులు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ(TG) వాసులు బతుకమ్మ పండగ(Bathukamma Festival)ను నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన ప్రవాసాంధ్రులు అట్లతద్దెను అదేస్థాయిలో నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గులు, ఆటలపోటీలు, భరతనాట్యం, కూచిపూడి, కోలాటం తదితర సాంస్కృతిక కార్యక్రమాల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో విజేతలుగా నిలిచివారికి బహుమతులు అందజేశారు. అలాగే ఎంతో భక్తిశ్రద్ధలతో ఉమాగౌరీ వ్రతం వేడుకగా చేశారు.
ఈ సందర్భంగా పాలడుగు సాయిసుధ మాట్లాడుతూ.. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, రాష్ట్రంలో కాలక్రమేణ అట్లతద్దె కనుమరుగు అవుతోందని అన్నారు. ఈ తరం ప్రజలు ఆనాటి పండుగలు, వేడుకల పట్ల శ్రద్ధ చూపడం లేదని, ఆ పండుగలు అంతరించిపోకుండా భవిష్యత్ తరాలకు వాటి ప్రాముఖ్యతను తెలియజేయాల్సిన అవసరం మనందరిపైనా ఉందని తెలిపారు. అమెరికాలో ఉన్న పిల్లలు, మహిళలు ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొనడం చాలా ఆనందాన్ని ఇచ్చిందన్నారు. సుధ కొండపు(Sudha Kondapu) మాట్లాడుతూ.. ఈ పండుగ సందర్భంగా ఆనవాయితీగా వస్తున్న ఉయ్యాల ఏర్పాటుచేసి వాయినాలు పంపిణీ చేశామని పేర్కొన్నారు. ఆడవాళ్లు ఉత్సాహంగా మెహందీ కార్యక్రమంలో పాల్గొని గోరింటాకు పెట్టుకున్నారని తెలిపారు.
సాంస్కృతి కార్యక్రమాలను నవ్య ఆలపాటి, సుష్మ అమృతలూరి సమన్వయపరిచారు. ఈ వేడుకలకు వెయ్యి మందికి పైగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అనిత మన్నవ, తనూజ యలమంచిలి, శ్రీదివ్య సోమ, గీత చిలకపాటి, ఇందు చలసాని, శిరీష నర్రా, అపర్ణ ఆలపాటి, శ్వేత కావూరి, శాంతి పారుపల్లి, ఫణి గాయత్రి, సరిత ముల్పూరి, మల్లి నన్నపనేని తదితరులు పాల్గొన్నారు.