Anna University: అన్నా యూనివర్సిటీలో యువతిపై లైంగిక దాడి

by Shamantha N |
Anna University: అన్నా యూనివర్సిటీలో యువతిపై లైంగిక దాడి
X

దిశ, నేషనల్ బ్యూరో: చెన్నై(Chennai) అన్నా యూనివర్సిటీలో(Anna University) విద్యార్థినిపై లైంగిక దాడి కలకలం రేపుతోంది. యూనివర్సిటీలో చదువుతున్న 19 ఏళ్ల విద్యార్థినిపై గుర్తుతెలియని వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. తన స్నేహితుడితో మాట్లాడుతున్న సమయంలో, ఇద్దరు వ్యక్తులు వచ్చి యువతిపై దాడి చేశారు. ఆమె స్నేహితుడ్ని కొట్టి, విద్యార్థినిపై లైంగిక దాడికి(Student sexually assaulted in Chennai) పాల్పడ్డారు. ఈ ఘటన డిసెంబర్ 23న సాయంత్రం జరగింది. బాధితురాలు యూనివర్సిటీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోందని పోలీసులు వెల్లడించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఒకరిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ ఘటనను వీడియో తీసి నిందితులు బాధితురాలిని, ఆమె స్నేహితుడ్ని బ్లాక్ మెయిల్ చేసినట్లు పేర్కొన్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ప్రతిపక్షాల విమర్శలు

యూనివర్సిటీ క్యాంపస్‌లో ఈ ఘటన జరగడంపై ప్రతిపక్షాలు ఎంకే స్టాలిన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. స్టాలిన్ ప్రభుత్వంపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై(Annamalai) మండిపడ్డారు. నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి భయంకరంగా ఉందని డీఎంకే(DMK) ప్రభుత్వంపై మండిపడ్డారు. “డీఎంకే ప్రభుత్వ హయాంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిలయంగా మారింది. నేరస్థులకు స్వర్గధామంగా మారింది. విపక్షాల నోరు మూయించేందుకు అధికార యంత్రాంగం పోలీసులను బిజీగా ఉంచుతోంది. దీంతో రాష్ట్రంలో మహిళలకు సురక్షణ లేకుండా పోయింది” అని సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

Advertisement

Next Story

Most Viewed