కుల,మతాలకు అతీతంగా అభివృద్ధి

by Sridhar Babu |   ( Updated:2024-12-25 12:01:10.0  )
కుల,మతాలకు అతీతంగా అభివృద్ధి
X

దిశ, కొడిమ్యాల : కుల, మతాలకు అతీతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి దిశలో పయనిస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. బుధవారం మండలంలోని నాచుపల్లి గ్రామంలో క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశంలో పౌరులందరికీ మత స్వేచ్ఛ హక్కును కల్పించారని అన్నారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ రాజ నర్సింగరావు, ఫాస్టర్ స్టీఫెన్, నాయకులు బర్ల లింగయ్య, శంకర్ గౌడ్, ముత్యం శంకర్, అజయ్ గౌడ్, చింటూ, అంజయ్య, జలంధర్, విక్రమ్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed