- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Congress: లోక్‌సభ పోల్స్‌లో ఆప్‌తో పొత్తు పెద్ద తప్పిదం : అజయ్ మాకెన్
దిశ, నేషనల్ బ్యూరో : గత లోక్‌సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)తో కాంగ్రెస్(Congress) చేతులు కలపడం అనేది పెద్ద తప్పిదమని ఆ పార్టీ సీనియర్ నాయకుడు అజయ్ మాకెన్(Ajay Maken) అన్నారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నమ్మదగిన వ్యక్తి అని నాడు, నేడు ఎన్నడూ తాను భావించలేదన్నారు. తన లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు కేజ్రీవాల్ ఎంతకైనా తెగిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్‌కు ఒక సైద్ధాంతికత కానీ, నిబద్ధత కానీ లేవన్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని ప్రస్తుత స్థితిగతుల వివరాలతో కాంగ్రెస్ పార్టీ రూపొందించిన బుక్‌లెట్‌ను ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్ బుధవారం విడుదల చేశారు. ఈ బుక్‌లెట్‌కు ‘మౌకా మౌకా.. హర్ బార్ ధోకా’ అనే టైటిల్ పెట్టారు. ఈసందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో అజయ్ మాకెన్ మాట్లాడారు.
‘‘ఓ వైపు ఢిల్లీలో కరోనాతో ప్రజలు చనిపోతున్న టైంలో.. మరోవైపు శీష్ మహల్ (సీఎం అధికారిక నివాసం) నిర్మాణంలో అరవింద్ కేజ్రీవాల్ బిజీగా గడిపారు. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం సైతం సెంట్రల్ విస్టా ప్రాజెక్టుతో బిజీగా మారింది’’ అని ఆయన విమర్శించారు. ఢిల్లీలోని ప్రభుత్వ స్కూళ్లలో 56వేలకుపైగా ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లు ఇంకా ఖాళీగాయనే ఉన్నాయని.. టీచర్లు లేకపోవడం వల్లే ఆయా స్కూళ్లలో విద్యార్థులు చేరడం లేదన్నారు. ‘‘ఢిల్లీలో నిర్మాణ దశలో ఉన్న 14 ప్రభుత్వ ఆస్పత్రుల కోసం రూ.10,250 కోట్లు కావాలి. ఈ ఏడాది ఇప్పటివరకు రూ.372 కోట్లనే కేటాయించారు. ఈవిధంగా నిర్లక్ష్యంగా నిర్మాణ పనులు జరిగితే 30 ఏళ్లయినా వాటి పనులు పూర్తికావు’’ అని మాకెన్ పేర్కొన్నారు. గత పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఢిల్లీని పాలిస్తున్న ఆప్ నూటికి నూరుపాళ్లు పాలనలో విఫలమయ్యాయని ఆయన మండిపడ్డారు.