IND Vs AUS: రేపటి బాక్సింగ్ డే టెస్టులో ఓపెనర్ గా రోహిత్ శర్మ?

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-12-25 12:15:44.0  )
IND Vs AUS: రేపటి బాక్సింగ్ డే టెస్టులో ఓపెనర్ గా రోహిత్ శర్మ?
X

దిశ, వెబ్ డెస్క్ : ఆస్ట్రేలియా-ఇండియా(Australia-India)మధ్య జరుగుతున్న బోర్డర్ - గవాస్కర్ టెస్ట్ సిరీస్ (Border - Gavaskar Test series)లో మెల్‌బోర్న్(Melbourne) వేదికగా రేపు గురువారం ప్రారంభం కానున్న నాలుగో టెస్టు బాక్సింగ్ డే టెస్టు(Boxing Day Test)లో కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)ఓపెనర్ గా రావచ్చని తెలుస్తోంది. బోర్డర్ - గవాస్కర్ టెస్ట్ సిరీస్ లో మూడు మ్యాచ్‌లు ముగిసిపోగా తొలి మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించగా, రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. మూడో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో నాల్గవ టెస్టు్ గెలిచి సిరీస్ కైవసం దిశగా ఆధిక్యత సాధించడం రెండు జట్లకు కీలకంగా మారింది. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించేందుకు రెండుజట్లు పోటాపోటీగా పోరాడనున్నాయి. పెర్త్ టెస్టు ఆడని రోహిత్ శర్మ అడిలైడ్, బ్రిస్బేన్ టెస్టుల్లో రోహిత్ శర్మ మిడిల్ ఆర్డర్‌లో ఆడాడు. పాత బంతిని ఎదుర్కోవడంలో విఫలమైన తాను బ్యాటింగ్ ఆర్డర్ లో మళ్లీ ఓపెనర్ గా వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాడు.

అయితే యశస్వి జైస్వాల్‌తో కలిసి కేఎల్ రాహుల్ మూడు టెస్టుల్లో రాణించాడు. రోహిత్ శర్మ ఓపెనింగ్ వస్తే కేఎల్ రాహుల్ వన్ డౌన్ స్థానంలో వస్తాడా లేక గతంలో మాదిరిగా 6వ నంబర్‌లో బ్యాటింగ్ చేస్తాడా అన్నది ఆసక్తికరంగా మారింది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్ మూడు మ్యాచ్‌ల్లో 235 పరుగులు చేసి ఈ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఇప్పుడు పేలవ ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మ కోసం కేఎల్ రాహుల్ తన ఆర్డర్‌ను మార్చుకోనున్నట్లు తెలుస్తుంది. రేపటి బాక్సింగ్ డే టెస్టుతో కేఎల్ రాహుల్ అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టి పదేళ్లు పూర్తికానుంది. ఈ టెస్టులో అస్ట్రేలియా పేసర్ స్టార్క్ మరో 5వికెట్లు సాధిస్తే టెస్టుల్లో 700వికెట్ల మైలురాయికి చేరుకుంటాడు. ఆసీస్ బౌల‌ర్లలో షేన్ వార్న్ 1001, గ్లెన్ మెక్‌గ్రాత్ 949, బ్రెట్ లీ 718 వికెట్లు తీసుకున్నారు. 284 అంత‌ర్జాతీయ మ్యాచుల్లో స్టార్క్ మొత్తం 695 వికెట్లు తీసుకున్నాడు.

టీమిండియా జట్టులో మార్పులు ?

బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగే ఛాన్స్ ఉందని సమాచారం. మెల్ బోర్న్ పిచ్ స్పిన్ కు సహకరించే అవకాశాలుండటంతో జడేజాతో పాటు వాషింగ్టన్ సుందర్ ను తీసుకుంటే తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ పై వేటు తప్పదు. అటు బూమ్రాకు తోడుగా సిరాజ్, ఆకాశ్ దీప్ లను ఆడించే అవకాశాలున్నప్పటికి సిరాజ్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణకు చాన్స్ ఇచ్చే అవకాశం లేకపోలేదు.

మెల్‌బోర్న్‌లో జరగనున్న టెస్టు కోసం ఆస్ట్రేలియా రెండు మార్పులు చేసినట్లు పాట్ కమిన్స్ తెలిపాడు. ఓపెనర్ నాథన్ మెక్‌స్వీనీ స్థానంలో శామ్‌ కాన్‌స్టాస్‌కు చోటు దక్కింది. ఎంసీజీలో శామ్‌ కాన్‌స్టాస్‌కి టెస్టుల్లోకి అరంగేట్రం చేయబోతున్నాడు. గాయంతో సిరీస్‌కు దూరమైన జోష్‌ హేజిల్‌వుడ్‌ స్థానంలో బోలాండ్‌కు చోటు కల్పించినట్లు పాట్‌ కమిన్స్‌ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ తర్వాత టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడైన ఆస్ట్రేలియన్‌ ప్లేయర్‌గా శామ్‌ కాన్‌స్టాస్‌ నిలిచాడు. కమిన్స్ తన 18వ ఏట 2011లో తన టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. 19 ఏళ్ల వయసులో కాన్‌స్టాస్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. బాక్సింగ్ డే టెస్టు రేపు ఉదయం 5 గంటలకు ప్రారంభమవుతుంది.

Advertisement

Next Story

Most Viewed