క్రిస్మస్ పండుగ వేల సీఎం శుభవార్త.. దళిత, గిరిజన క్రైస్తవులకు అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని హామీ

by Mahesh |
క్రిస్మస్ పండుగ వేల సీఎం శుభవార్త.. దళిత, గిరిజన క్రైస్తవులకు అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని హామీ
X

దిశ, వెబ్ డెస్క్: క్రిస్మస్(Christmas) పండుగ వేల తెలంగాణ రాష్ట్రంలోని క్రైస్తవుల(Christians)కు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) శుభవార్తను(good news) అందించారు. క్రిస్మస్ సందర్భంగా సీఎం మెదక్ జిల్లాలోని ప్రసిద్ధి చెందిన చర్చి(church) కి వెళ్ళారు. చర్చిలో ప్రార్థనలు చేసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం క్రైస్తవులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పుకొచ్చారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల(Indiramma houses)ను.. దళిత, గిరిజన క్రైస్తవులకు అత్యధికంగా ఇవ్వడానికి రాష్ట్రప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో సీఎం తో పాటు మంత్రి దామోదర రాజనర్సింహ, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, స్థానిక ఎమ్మెల్యే రోహిత్ రావు పాల్గొన్నారు. అంతకు ముందు పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం ప్రారంభించారు.

Advertisement

Next Story

Most Viewed