MP Raghunandan: సీవీ ఆనంద్.. చేతనైతే ఆ పని చెయ్: ఎంపీ రఘునందన్ సంచలన వ్యాఖ్యలు

by Shiva |
MP Raghunandan: సీవీ ఆనంద్.. చేతనైతే ఆ పని చెయ్: ఎంపీ రఘునందన్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: సంధ్య థియేటర్ తొక్కిసలాట (Sandhya Theater Stampede) ఘటనలో బౌన్సర్లు ఓవరాక్షన్ చేశారంటూ ఇటీవలే హైదరాబాద్ (Hyderabad) సీపీ సీవీ ఆనంద్ (CP CV Anand) ఇటీవలే ప్రెస్‌మీట్‌లో వెల్లడించారు. ఇక మీదట పబ్లిక్‌ను బౌన్సర్లు తోసేసినా.. పోలీసులపై చేయి వేసినా వారి తాట తీస్తామని వార్నింగ్ ఇచ్చారు. కాగా, తొక్కిసలాట కేసులో A11గా ఉన్న అల్లు అర్జున్‌ (Allu Arjun) వ్యక్తిగత బౌన్సర్ ఆంటోనీ (Antony)ని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా, ప్రైవేట్ బౌన్సర్ల వ్యవస్థపై ఎంపీ రఘునందన్ రావు (MP Raghunandan Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే ఊరంతా కోపగించుకుటారని.. అందరికీ శత్రువులు అవుతారంటూ పెద్దలు చెప్పారని కామెంట్ చేశారు. రాష్ట్రంలో బౌన్సర్లను పెట్టుకుని నెట్టేయించే సంస్కృతిని తెచ్చిందే ఆనాడు పీసీసీ చీఫ్‌గా పని చేసిన రేవంత్ రెడ్డి (Revanth Reddy) అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ దుకాణం పెట్టింది నేటి సీఎం (CM) అని చురకలంటించారు. అసలు అల్లు అర్జున్ (Allu Arjun) పంచాయతీలో బౌన్సర్లను ఎందుకు తీసుకొస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌ (CP CV Anand)కు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో సమూలంగా బౌనర్ల వ్యవస్థను రద్దు చేయాలని ఎంపీ రఘునందన్ రావు సవాల్ విసిరారు.

Next Story

Most Viewed