- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
టీడీపీకి నేను ట్రబుల్ షూటర్‌ని.. ట్రబుల్ మేకర్‌ని కాదు: మాజీ మంత్రి జవహర్

దిశ, వెబ్‌డెస్క్: ఎస్సీ వర్గీకరణ (Classification of SC)పై రాష్ట్రంలో అధికార, విపక్ష నాయకుల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జవహర్ (Jawahar), మాజీ సీఎం జనన్మోహర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసలు ఎస్సీ వర్గీకరణకు వైసీపీ పార్టీ (YCP Party)తో పాటు మాజీ సీఎం జగన్ (Jagan) బద్ధ వ్యతిరేకి అని కామెంట్ చేశారు. సుప్రీంకోర్టు (Supreme Court) గైడ్‌లైన్స్ మేరకు తమకు అసెంబ్లీ (Assembly)లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి అమోదింపజేసుకునే సత్తా ఉందన్నారు.
కానీ, శానసమండలి (Legislative Council)లో పరిస్థితి వేరుగా ఉందని వైసీపీ నాయకులు బిల్లుకు అడ్డుపడే అవకాశం ఉందన్నారు. అందుకే ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకూడదనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్ (Ordinance) తీసుకొచ్చిందని స్పష్టం చేశారు. తాను పార్టీ నుంచి ఏ పదువులు ఆశించడం లేదని.. సీఎం చంద్రబాబు (CM Chandrababu) తనపై ఏ పదవి అప్పగించినా బాధ్యతతో పని చేస్తానని అన్నారు. కొవ్వూరు (Kovvur)లో సొంత పార్టీ నేతలు, ప్రభుత్వంలో భాగస్వాములైన వారిని తాను ఇబ్బందులు పెడుతున్నానంటూ తనపై ఆరోపణలను చేస్తున్నారని.. కానీ, ఇబ్బందులు పడే పరిస్థితులు వారే కొనితెచ్చుకున్నారనే విషయాన్ని మరువొద్దని తెలిపారు. నియోజకవర్గంలో జరుగుతోన్న పరిణామాలను మీడియా (Media)తో పాటు ప్రజలు చూస్తున్నారని అన్నారు. టీడీపీకి తాను ట్రబుల్ షూటర్‌ని కానీ.. ట్రబుల్ మేకర్‌ను కాదని జవహర్ స్పష్టం చేశారు.