Breaking:మాజీ సీఎం జగన్​కు బిగ్ ​షాక్.. అక్రమాస్తుల కేసులో ఈడీ కొరడా?

by Jakkula Mamatha |   ( Updated:2025-04-18 06:47:43.0  )
Breaking:మాజీ సీఎం జగన్​కు బిగ్ ​షాక్.. అక్రమాస్తుల కేసులో ఈడీ కొరడా?
X

దిశ, డైనమిక్ ​బ్యూరో : మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ ​జగన్‌కు బిగ్​షాక్​ తగిలింది. ఆయనకు సంబంధించిన రూ.800 కోట్ల విలువైన భూములు, షేర్లను ఈడీ జప్తు చేస్తున్నట్లు సమాచారం. 2009-10లో నమోదైన అవినీతి ఆరోపణల కేసులో ఈ చర్యలు తీసుకున్నారు. వైఎస్ జగన్​ ఎంపీగా ఉన్నప్పుడు పలు కంపెనీలకు లాభాలు కలిగించినందుకు వ్యాపార సంస్థల నుంచి లాభాలు పొందారనే ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్​, బెంగుళూరు నగరాల్లో ఉన్న భూములు కొన్ని కంపెనీల్లో వాటాలు అటాచ్​చేసినట్లు సమాచారం. ఈ ఆస్తులు జగన్​ వ్యక్తిగతం కంటే ఎక్కువగా ఆయన కుటుంబానికి సంబంధించిన కంపెనీలు, సహచరుల పేరిట ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో సీబీఐ విచారణ జరుపుతోంది.

కాగా నిన్న జగన్ అక్రమాస్తుల కేసులో దాల్మియా సిమెంట్స్ ఆస్తుల అటాచ్ చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ నిర్ణయం తీసుకుంది. రూ.793 కోట్ల విలువైన దాల్మియా సిమెంట్స్ ఆస్తులు ఈడీ అటాచ్ చేసింది. కడప జిల్లాలో 417 హెక్టార్ల భూమి కేటాయింపులో దాల్మియా పై అభియోగం ఉంది. దాల్మియా సిమెంట్స్‌కు సున్నపురాయి లీజుల కేటాయింపులపై అభియోగాలు ఉన్నాయి. సీబీఐ ఛార్జ్ షీట్ ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ విచారణ జరిపించింది. జగన్ రూ.150 కోట్ల లబ్ధిని షేర్లు హవాలా రూపంలో నగదు పొందినట్లు అభియోగం ఉంది. జగన్తో కలిసి అక్రమంగా సున్నపురాయి గనులు లీజు పొందినట్లు 2013లో సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇందులో జగన్ సుమారు రూ.150 కోట్ల అక్రమ లబ్ధిని పొందినట్లు సీబీఐ అభియోగం మోపింది. 14 ఏళ్లుగా ఈ మనీలాండరింగ్ ​కేసు విచారణ సాగుతోంది.



Next Story

Most Viewed