- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్రైస్తవుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
దిశ, ఉట్నూర్ : రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవులకు 100 శాతం రాయితీతో కూడిన సబ్సిడీ లోన్ లను త్వరలో ఇవ్వనున్నట్లు ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. బుధవారం మండలంలోని దంతనపల్లి చర్చితో పాటు మండల కేంద్రంలోని సీఎస్ఐ, బేతేస్థా, మోరియా చర్చిలలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేసి, కేక్ కట్ చేసి తినిపించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రేమ, దయ, కరుణామయుడైన యేసు ప్రభువు చల్లని దీవెనలు ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు.
రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. యువతీ, యువకులకు ట్రేనింగ్ లు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ప్రాంతంలోని ప్రార్థన మందిరాల చుట్టూ ప్రహరీ గోడతో పాటు బోర్ వేసి నీటి సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. శ్మశాన వాటిక సమస్యలను త్వరగా పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, అర్హులైన పేద క్రైస్తవ సోదరులకు ఇందిరమ్మ ఇండ్లను ఇస్తామన్నారు. మహిమ గల యేసుక్రీస్తు దీవెనలతో ప్రపంచమంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, క్రైస్తవ సోదర, సోదరీమణులు పాల్గొన్నారు.