- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారీగా పెరిగిన బీవోబీ, ఇండియన్ బ్యాంకుల నిరర్ధక ఆస్తులు!
దిశ, వెబ్‌డెస్క్: గడిచిన ఆరు సంవత్సరాల్లో బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) నిరర్ధక ఆస్తులు(ఎన్‌పీఏ) 6 రెట్లు, ఇండియన్ బ్యాంక్ నిరర్ధక ఆస్తులు 4 రెట్లు పెరిగినట్టు ఆర్‌టీఐ చట్టం ద్వారా తెలిసింది. రాజస్థాన్‌లోని కోటా ప్రాంతానికి చెందిన సుజీత్ అనే కార్యకర్త ఇచ్చిన ఆర్‌టీఐ దరఖాస్తుతో ఈ సమాచారం తెలిసింది. ఈ సమాచారం ద్వార..2014, మార్చిలో రూ. 11,876 కోట్లుగా ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా ఎన్‌పీఏలు 2019, డిసెంబర్ నాటికి రూ. 73,140 కోట్లకు చేరాయి. ఎన్‌పీఏ అకౌంట్లు 2,08,035 నుంచి 6,17,306కు పెరిగినట్టు తెలుస్తోంది.
మరో బ్యాంక్ ఇండియా బ్యాంక్ ఎన్‌పీఏ 2014, మార్చి చివరి నాటికి రూ. 8,068.05 కోట్లు ఉండగా, 2019, డిసెంబర్ నాటికి రూ. 32,561కి చేరినట్టు సమాచారం. ఎన్‌పీఏ అకౌంట్ల సంఖ్య 5,64,816 నుంచి రూ. 2,48,921కి పెరిగాయి. అంతేకాకుండా, పలు రకాల ప్రాసెసింగ్ ఛార్జీల కింద ఈ రెండు బ్యాంకులకు భారీగా అదాయం సమకూరినట్టు తెలుస్తోంది. 2018 ఏప్రిల్ 1 నుంచి 2020, ఫిబ్రవరి 29 మధ్య కాలంలో బ్యాంక్ ఆఫ్ బరోడాకు కేవలం ఎస్ఎమ్ఎస్ ఛార్జీల కిందే రూ. 107.7 కోట్లు అందినట్టు, ఇండియన్ బ్యాంకుకు రూ. 21 కోట్లు వసూలైనట్టు సమాచారం.
Tags: Indian Bank, bank of baroda, NPA