- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆన్ లైన్ లో కరోనా టెస్ట్
దిశ, వెబ్ డెస్క్ : దేశమంతా లాక్ డౌన్ ఉన్నప్పటికీ … వేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ వల్ల ఎంతోమంది భయపడుతున్నారు. చిన్న లక్షణాలు కనిపించిన ఆందోళన పడుతున్నారు. తమకు కూడా కరోనా సోకిందని హైరానా పడుతున్నారు. సో వారందరికీ శుభవార్త. ఇప్పటివరకు ఆసుపత్రుల్లో మాత్రమే కరోనా టెస్ట్ చేయించుకోవాల్సి వచ్చేది.. ఇకపై ఆన్ లైన్ కూడా కోవిడ్ టెస్ట్ చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో ప్రాక్టో వైద్యపరీక్షల సంస్థ కరోనా డిటెక్షన్ పరీక్షలు చేసేందుకు ముందుకు వచ్చింది. భారత ప్రభుత్వం మరియు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) ఆమోదంతో బెంగళూరుకు చెందిన ప్రాక్టో సంస్థ కరోనా డిటెక్షన్ పరీక్షలు చేసేందుకు వీలుగా థైరో కేర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతానికి ముంబైలోనే అందుబాటులో ఉన్న ఈ సేవలను త్వరలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకు రానుంది.
ప్రాక్టోలో కరోనా టెస్ట్ స్లాట్ బుక్ చేసుకునేందుకు.. ముందుగా మనం.. వైద్యుడి ప్రిస్క్రిప్షన్, వైద్యుడు సంతకం చేసిన టెస్ట్ రిక్విజిషన్ ఫారం, వ్యక్తి ఫొటో ఐడి కార్డును సమర్పించాల్సి ఉంటుంది. ఈ టెస్టును బుక్ చేసుకోవడానికి రూ.4,500 ఖర్చు అవుతుంది. https://www.practo.com/covid-test, https://covid.thyrocare.com/ వెబ్ సైట్ల ద్వారా ఈ టెస్టును ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న తర్వాత ఐ2 హెచ్ నుంచి సర్టిఫైడ్ ఫైబోటోమిస్టులు నేరుగా మన ఇంటికే వచ్చి నమూనాలను సేకరించి వాటిని థైరోకేర్ ప్రయోగశాలలో పరీక్షల కోసం తరలిస్తారు. శాంపిల్స్ తీసుకునేటప్పుడు ఐసీఎంఆర్ నియమాలన్నిటినీ వారు పాటిస్తారని తెలిపింది. పేషేంట్ నమూనా సేకరణ జరిగిన 24-48 గంటలలోపు ప్రాక్టో వెబ్‌సైట్‌లో పరీక్షల నివేదిక రోగులకు అందుబాటులో ఉంచుతామని ప్రాక్టో చీఫ్ హెల్త్ స్ట్రాటజీ ఆఫీసర్ డాక్టర్ అలెగ్జాండర్ కురువిల్లా చెప్పారు. కరోనా ప్రబలుతున్న క్లిష్టసమయాల్లో ప్రజలకు కరోనా పరీక్షలు అందుబాటులో ఉంచేందుకు తాము కట్టుబడి ఉన్నామని డాక్టర్ అలెగ్జాండర్ వివరించారు. వ్యాధి లక్షణాలు కనిపించిన ప్రతి ఒక్కరికీ దీనికి సంబంధించిన టెస్టులు జరిగేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుందని పేర్కొన్నారు. వైద్యపరమైన సలహాలు, పరీక్షలు, మందుల డెలివరీ వంటి అంశాల్లో ప్రభుత్వానికి తమ నుంచి పూర్తి సహకారం ఉంటుందన్నారు.ఇప్పటికే ముంబై నగరంలో అందుబాటులోకి వచ్చిన ఈ సేవలు దేశంలోని మిగిలిన ప్రాంతాలకు విస్తరిస్తామని ప్రాక్టో అధికారి వెల్లడించారు.
Tags : corona virus, test, online, practo, thyro care, central govt, doctor, mumbai,