- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లాక్‌డౌన్ కాలానికి ఉద్యోగులకు జీతాలివ్వరట!
దిశ, సెంట్రల్ డెస్క్: కొవిడ్-19 సంక్షోభం కారణంగా ఇప్పటికే జీతాల్లో కోత వల్ల ఆర్థికంగా చితికిన ఉద్యోగులకు కేంద్రం మరోసారి షాక్ ఇచ్చింది. లాక్‌డౌన్ కాలంలో పనిచేయని ఉద్యోగుల జీతాలను చెల్లించాల్సిన అవసరం లేదని పరిశ్రమలకు స్పష్టం చేసింది. ఇదివరకు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేస్తున్నట్టు హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎమ్‌హెచ్ఏ) తాజా ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం లాక్‌డౌన్ కాలంలో పనిచేయని ఉద్యోగులకు సంస్థలు తప్పనిసరిగా జీతాలను చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. పరిశ్రమలు మూతపడినా సరే ఎటువంటి కోతలు లేకుండా ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని మార్చి 29న హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులను ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇటీవల కరోనా సంక్షోభాన్ని అడ్డం పెట్టుకుని ఐటీ ఉద్యోగులను తొలగించకుండా, వారి జీతాల కోత లేకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ గతవారం దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. అలాగే, మార్చి 20న కార్మిక కార్యదర్శి నోటిఫికేషన్, మార్చి 29న హోమ్‌శాఖ ఉత్తర్వులపై కర్ణాటక కేంద్రంగా పనిచేసే ఫికస్ పాక్స్ ప్రైవేట్ సంస్థ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందిస్తూ కరోనా కాలంలో తమ ఉద్యోగులకు పూర్తి జీతాలు చెల్లించని సంస్థలపై ఎటువంటి బలవంతమైన చర్యలు తీసుకోవద్దంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎమ్‌హెచ్ఏ ఆదేశాలను జారీ చేసింది. అయితే, ఆర్థిక సంక్షోభం ముదరకుండా, ముఖ్యంగా దేశ జీడీపీని కాపాడుకునేందుకు, ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించడానికి అనేక రాష్ట్రాలు కంటైన్‌మెంట్ జోన్లు మినహా అన్ని ప్రాంతాల్లో కీలకమైన ఆర్థిక కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఆంక్షలను సడలించిన సంగతి తెలిసిందే.