- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నోరా.. సక్సెస్ సీక్రెట్!
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి డ్యాన్స్ మూవ్స్‌కు ఇండస్ట్రీ ఫిదా అయిపోయింది. అభిమానుల ఆదరణతో ఐటెం సాంగ్స్‌కు న్యూ క్వీన్‌గా అవతరించింది. చాలా షార్ట్ టైమ్‌లోనే సూపర్ హైట్స్ రీచ్ అయిన నోరా.. తన సక్సెస్ సీక్రెట్ రిస్క్ తీసుకోవడమే అని చెప్తోంది. సినీ రంగంలోకి రాకపోతే లాయర్ అయుండేదాన్నని అంటున్న నోరా.. ఎవరికి, దేనికి భయపడకుండా ముందడుగు వేయాలని, అప్పుడే సక్సెస్ అందుకుంటామని సూచించింది. లైఫ్‌లో బెస్ట్ అడ్వైస్ అందుకున్నది ఫ్రెండ్స్ ద్వారానే అని.. చిన్న విషయానికే స్ట్రెస్ అవడం తనలో ఉన్న విచిత్రమైన అలవాటని చెప్పింది.
ఇక తనకు ఆత్రుత ఎక్కువ అని.. ఆ విషయంలో చేంజ్ కావాల్సి ఉందని తెలిపింది నోరా. చిన్న పిల్లలు, కుక్క పిల్లలను చూస్తే వెంటనే పెదాలపై చిరు నవ్వు ప్రత్యక్షం అవుతుందని.. ఆనందంగా ఉంటుందని చెప్పిన నోరా.. ఇంటి వరకు తనను ఫాలో అయిన అభిమాని గురించి తలచుకుంటే చాలా క్రేజీగా అనిపిస్తుందని చెప్పింది. మహిళలు జీవితంలో ఒక్కసారైనా ఒంటరిగా ప్రయాణం చేయాలని సూచించిన ఈ ఐటం క్వీన్.. కాలమే మనిషికి, మనసుకి కలిగిన బాధలను నయం చేస్తుందని తెలిపింది.
కాగా, నోరా ఈ మధ్య ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్ షో కార్యక్రమానికి అతిథిగా హాజరైంది. ఈ క్రమంలో తనతో డ్యాన్స్ చేసిన ఆ షో జడ్జ్, కొరియోగ్రాఫర్ టెరెన్స్ లూయిస్.. తనను అనవసరంగా, అసభ్యంగా టచ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో లూయిస్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాలీవుడ్‌లోనే కాదు ఇలాంటి షోస్ లోనూ అమ్మాయిల పట్ల ఇంత అసభ్యంగా ప్రవర్తించడం అసహ్యంగా అనిపిస్తోందని మండిపడుతున్నారు నెటిజన్లు.
ఫోటోలు కోసం కింద క్లిక్ చేయండి