- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాన్ చైనీస్ మొబైల్ బ్రాండ్స్
చైనా వస్తువులు కొనకూడదని, చైనీస్ యాప్స్ వాడొద్దంటూ దేశమంతటా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దేశీ ప్రొడక్ట్స్, యాప్స్‌కు ఆదరణ పెరుగుతోంది. అంతేకాదు.. నాన్ చైనీస్ ప్రొడక్ట్స్ వాడాటానికే ఇండియన్స్ మొగ్గు చూపుతున్నారు. అయితే చాలా మందికి నాన్ చైనీస్ మొబైల్ కంపెనీలేంటో తెలియడం లేదు. ఓసారి అవేంటో తెలుసుకుందాం.
మైక్రోమాక్స్
ఇండియాలో అతి పెద్ద మొబైల్ కంపెనీగా ‘మైక్రోమాక్స్ ఇన్ఫార్మిటిక్స్’ను చెప్పొచ్చు. చాలా తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లున్న ఫోన్లను విడుదల చేయడం దీని ప్రత్యేకత. ఎల్ఈడీ టీవీలు, టాబ్లెట్స్‌ను కూడా తయారు చేసే ఈ కంపెనీ హెడ్ క్వార్టర్స్.. గురుగ్రామ్, హర్యానాలో ఉన్నాయి. మోహిత్ శర్మ, దేవాస్, రోహిత్ పటేల్‌లు ఈ కంపెనీ కో ఫౌండర్స్ కాగా, 2008 నుంచి మైక్రోమాక్స్ ఫోన్లు అమ్మడం ప్రారంభించింది. కాన్వాస్ ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ ఎన్11లు మైక్రోమాక్స్ నుంచి వచ్చిన ఫేమస్ మోడల్ ఫోన్లుగా చెప్పొచ్చు. ప్రస్తుతానికి మూడు బడ్జెట్ ఫోన్లను త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు కంపెనీ ఇటీవలే ప్రకటించింది.
లావా ఇంటర్నేషనల్
2009లో ప్రారంభమైన ఈ కంపెనీకి ‘హరి ఓమ్ రాయ్’ చైర్మన్ అండ్ ఎండీగా వ్యవహరిస్తున్నారు. సైబర్ మీడియా రీసెర్చ్ ఇండెక్స్ 2018 ప్రకారం.. ‘మోస్ట్ ట్రస్ట్ వర్తీ’ బ్రాండ్‌గా ‘లావా’ మొబైల్స్ కంపెనీ నిలవడం విశేషం. కంప్లీట్ డిజైన్‌తో పాటు టోటల్‌గా ఇండియా ప్రొడక్ట్స్‌తోనే మానుఫ్యాక్చరింగ్ జరిగే ఏకైక మొబైల్ ‘లావా’నే కావడం విశేషం.
జోలో
లావా ఇంటర్నేషనల్ సబ్సిడరీ కంపెనీనే ‘జోలో’. ఇంటెల్ ప్రాసెసర్‌తో స్మార్ట్‌ఫోన్ విడుదల చేసిన తొలి కంపెనీ జోలో. ఈ కంపెనీ నుంచి జోలో బ్లాక్, జోలో క్యూ సిరీస్ మొబైల్స్ మంచి ఆదరణ పొందాయి. కాగా ఈ కంపెనీ హెడ్ క్వార్టర్స్ నోయిడాలో ఉంది.
యాపిల్ ఐఎన్‌సీ
‘యాపిల్’ పరిచయం అక్కర్లేని బ్రాండ్. యాపిల్ హెడ్ క్వార్టర్ కాలిఫోర్నియాలోని క్యూపర్‌టినో. అమెరికాకు చెందిన ఈ కంపెనీ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, ఆన్‌లైన్ సర్వీసెస్ సేల్ చేస్తుండటంతో పాటు మానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. స్టీవ్ జాబ్స్, స్టీవ్ వోజ్నియాక్, రోనాల్డ్ వెయిని 1976లో దీన్ని ప్రారంభించారు. 2007 నుంచి ఐఫోన్లను అమ్మడం ప్రారంభించగా, ఇప్పటికీ ప్రపంచంలోని టాప్ బ్రాండ్‌గా కొనసాగుతోంది. ఐఫోన్ 11, ఐఫోన్ 11ప్రో, ఐఫోన్ ఎస్ఈ లేటెస్ట్ మోడల్స్.
శాంసంగ్
ఇది కొరియన్ కంపెనీ. సియోల్‌లోని ‘శాంసంగ్’ టైన్ దీని హెడ్ క్వార్టర్. 1938లో లీ బ్యుంగ్ చుల్ ట్రేడింగ్ కంపెనీగా దీన్ని మొదలు పెట్టాడు. 1960 నుంచి ఎలక్ట్రానిక్స్ ఇండియాలో అడుగుపెట్టింది. తక్కువ ధరల్లో స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టిన తొలి కంపెనీగా శాంసంగ్ నిలిచింది.
నోకియా (ఫిన్‌లాండ్), మోటోరోలా(అమెరికా), ఎల్‌జీ (సౌత్ కొరియన్), సెల్‌కాన్(ఇండియా), కార్బన్ (ఇండియా), సోనీ (జపాన్), ఇంటెక్స్ (ఇండియా)లు కూడా నాన్ చైనీస్ మొబైల్ కంపెనీలే.