- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డైవర్స్ తీసుకున్న సింగర్, హీరోయిన్
దిశ, వెబ్ డెస్క్: సింగర్ నోయల్, హీరోయిన్ ఎస్తర్ ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, తాము విడాకులు తీసుకున్నట్లు నోయల్ మంగళవారం ప్రకటించాడు. చాలా బాధాకరమైన నిశ్శబ్దం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇన్నాళ్లు కోర్టు తీర్పు కోసం వెయిట్ చేశామని.. అన్ని ఫార్మాలిటీస్ అయిపోయాక పబ్లిక్‌గా ఈ విషయం చెప్పాలి అనుకున్నట్లు తెలిపారు. ఇద్దరి మధ్య నెలకొన్న విభేదాలతో ఈ బంధానికి ఎండ్ చెప్పాలి అనుకున్నామని.. మా మధ్య ఉన్న అందమైన బంధం కాపాడుకునేందుకు మాత్రమే విడాకుల నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఎస్తర్ లైఫ్‌లో అన్నీ బెస్ట్ జరగాలని కోరుకున్న నోయల్.. అందరూ ఈ సమయంలో మాకు తోడుగా నిలవాలని కోరాడు. ఈ బాధ నుంచి బయట పడేందుకు హెల్ప్ చేయాలని అన్నాడు నోయల్. పెండ్లి అనేది తన లైఫ్‌లో బ్యూటిఫుల్ ఫేజ్ అని తెలిపిన నోయల్..అలాంటి రోజులు ఇచ్చినందుకు దేవుడికి థాంక్స్ చెప్పాడు. కష్టాల్లో తనకు తోడుగా నిలబడిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కృతజ్ఞతలు తెలిపాడు. దేవుడు ఏది చేసినా మంచే చేస్తాడని నమ్ముతాను అని.. ఇది గొప్ప ప్రారంభంగా భావిస్తున్నాను అని తెలిపారు నోయల్.
View this post on InstagramA post shared by Noel (@mr.noelsean) on