- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గొర్రెల మందపై కుక్కల దాడి.. 12 గొర్రెలు మృతి
దిశ,చిన్నశంకరంపేట : గొర్రెల మంద పై కుక్కలు దాడి చేయడంతో 12 గొర్రెలు మృతి చెందిన సంఘటన చిన్న శంకరం పేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మంగళవారం చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని పుల్ల స్వామి కి చెందిన గొర్రెల మంద పై కుక్కలు దాడి చేయడంతో 12 గొర్రెలు మృతి చెందడంతో సుమారు రూ.60 వేల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న చిన్నశంకరంపేట మాజీ సర్పంచ్ రాజ్ రెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీన్ లు సంఘటన స్థలానికి చేరుకున్న బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధితుడు పుల్ల సామి మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా ఇక్కడే గొర్రెల మంద పెట్టుకొని జీవనం కొనసాగిస్తున్నామని, గొర్రెల పెంపకం పైనే, మా కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, ప్రభుత్వం తమకు నష్టపరిహారం ఇప్పించే విధంగా చూడాలని వారు కోరారు.
మండల కేంద్రంలో కుక్కలతో బెంబేలు..
కుక్కలు పెట్రేగిపోతున్నాయని పక్కన పరిశ్రమలు వెలసిన నుండే ఇబ్బందులు పడుతున్నామని 40 సంవత్సరాల నుండి లేని కుక్కలు, పరిశ్రమలు ఏర్పాటు అయిన నుంచి పెరిగిపోయాయని, పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు మాంసం వ్యర్థ పదార్థాలను రోడ్డుపై వేయడంతో కుక్కలు పెరుగుతున్నాయని బాధితులు తెలిపారు. సంబంధిత పరిశ్రమ యజమానులు మాకు నష్టపరిహారం చెల్లించే విధంగా చూడాలని వారు కోరారు. రోడ్డుపై ఒంటరిగా వెళుతున్న పాదాచారులకు, వాహనదారులు,మనసులు రోడ్డు వెంబడి నడిస్తే, కుక్కలు దాడి చేయడం జరుగుతుందని, పొలాల వద్దకు వెళ్లాలని భయభ్రాంతులకు గురికావాల్సిన వస్తుందని తెలిపారు.గతంలో కుక్కల దాడిలో కొంతమందికి తీవ్ర గాయాలైన సంఘటనలు విధితమే. పంచాయతీ అధికారులు బాధితుడు పుల్ల స్వామి కోరారు.