- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
వేసవిలో నో పవర్ కట్స్
దిశ, తెలంగాణ బ్యూరో: ఈ వేసవిలో టీఎస్ ఎస్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడదని టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి అన్నారు. జోనల్, సర్కిల్ హెడ్లు ఇచ్చిన నివేదిక ప్రకారం అందుకు తీసుకోవాల్సిన చర్యలపై సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, చీఫ్ జనరల్ మేనేజర్లు, ఇంజినీర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవి దృష్ట్యా గ్రేటర్ హైదరాబాద్ లో విద్యుత్ సమస్యలను అధిగమించేందుకు అదనంగా 56 పవర్ ట్రాన్స్ ఫార్మర్లు, 1,725 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లు, పదకొండు 33/11 కేవీ సబ్ స్టేషన్లను సిద్ధం చేసినట్లు స్పష్టం చేశారు. విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగకుండా బ్రేకర్లు పునరుద్ధరంచడమే కాకుండా చెట్ల కొమ్మలను తొలగించడం కూడా పూర్తయినట్లు ఆయన పేర్కొన్నారు. 33 కేవీ ఫీడర్ల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తకుండా ఫీల్డ్ ఆఫీసర్లు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘమారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ వేసవి ముగిసే వరకు ప్రతిరోజు రాత్రి 9 గంటల వరకు 33/11 కేవీ సబ్ స్టేషన్ల నుంచి జరిగే విద్యుత్ సరఫరా స్థితిని పర్యవేక్షించాలని సూపరింటెండింగ్ ఇంజినీర్లు, అసిస్టెంట్ ఇంజినీర్లకు ఆయన సూచించారు.
గణనీయంగా విద్యుత్ డిమాండ్
తెలంగాణలో వ్యవసాయం, పారిశ్రామికి రంగాల్లో విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగిపోవడం వల్ల రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగిందని టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. కేవలం గ్రేటర్ హైదరాబాద్‌లో 2014 జూన్ లో గరిష్ట విద్యుత్ వినియోగం 49.56 మిలియన్ యూనిట్లుంటే 2019 మే 29 వరకు 73.84 మిలియన్ యూనిట్లకు చేరుకుందని ఆయన స్పష్టం చేశారు. టీఎస్ ఎస్పీడీసీఎల్ వ్యాప్తంగా 2014 ఏప్రిల్ లో 119.6 మిలియన్ యూనిట్లుంటే మార్చి 2021 వరకు 180.5 మిలియన్ యూనిట్లకు చేరిందన్నారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ లో 80 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా టీఎస్ ఎస్పీడీసీఎల్ వ్యాప్తంగా 185 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. అన్ని రకాల పరిశ్రమలకు, వినియోగదారులకు నిరంతరాయ విద్యుత్ అందించేందుకు అన్నిరకాల ఏర్పాట్లను సిద్ధం చేసినట్లు రఘుమారెడ్డి తెలిపారు. విద్యుత్ సరఫరా, వోల్టేజ్ సమస్యలుంటే టీఎస్ ఎస్పీడీసీఎల్ వెబ్‌సైట్, టీఎస్ ఎస్పీడీసీఎల్ మొబైల్ యాప్, ట్విట్టర్, ఫేస్‌బుక్ ద్వారా తెలియజేయవచ్చని ఆయన స్పష్టం చేశారు.