- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా తెచ్చిన తంటా.. ఈ రాష్ట్రాల్లో హోళి వేడుకలు రద్దు
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తితో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఏడాది జరిగే హోళి వేడుకలకు బ్రేక్ వేస్తున్నాయి. ప్రజలు గుమిగూడటం వల్ల కరోనా వ్యాప్తి విస్తరించే ప్రమాదం ఉండటంతో వేడుకలు, భారీ సమావేశాల వంటివి జరపకూడదని వాటిపై నిషేధం విధిస్తున్నాయి. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఒడిషా, మహారాష్ట్రలు ఈ ఏడాది హోళి వేడుకలను రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ జాబితాలో రాజస్థాన్, మేఘాలయా కూడా చేరాయి.
కొద్దిరోజులుగా రాజస్థాన్, మేఘాలయాలలోనూ కరోనా కొత్త స్ట్రైయిన్ కేసులు పెరుగుతుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు తాజా నిర్ణయం తీసుకున్నాయి. రాజస్థాన్ లో హోళి (మార్చి 28) తో పాటు తర్వాత రోజు జరిగే షబ్-ఈ-బరత్ వేడుకలను కూడా ప్రభుత్వం రద్దు చేసింది.
ఈ ఏడాది హోళిపై నిషేధం విధించిన రాష్ట్రాలు
ఢిల్లీలో హోళి, షబ్-ఈ-బరత్‌తో పాటు నవరాత్రి ఉత్సవాలను కూడా రద్దు చేశారు. ముంబయిలో హోళితో పాటు రంగపంచమి వేడుకలపై నిషేధం విధించారు. ఉత్తరప్రదేశ్‌లో హోళి వేడుకల మీద బ్యాన్ ఏమీ లేకపోయినా ప్రజలు గుమిగూడటాన్ని నిషేధించారు. ఛండీగఢ్, బీహార్, గుజరాత్ లలో కూడా వేడుకలు, ఊరేగింపులను తక్కువ మందితో జరుపుకోవాలని ఆదేశాలున్నాయి. ఒడిషా, రాజస్థాన్, మేఘాలయాలలో హోళి వేడుకలను పూర్తిగా రద్దు చేశారు. ప్రజలు ఇళ్లల్లోనే ఉండి హోళిని జరుపుకోవాలని ప్రభుత్వాలు ఆదేశించాయి.