పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం

by vinod kumar |
పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం
X

దిశ, నిజామాబాద్: కరోనా వ్యాప్తి నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను నిజామాబాద్ వాసులు సన్మానించారు. నగర పాలక సంస్థ పరిధి వినాయకనగర్‌లో 45వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల హేమలత శ్రీనివాస్ ఆధ్వర్యంలో శాలువాలు కప్పి, పూలతో ఘనంగా సత్కరించారు. అలాగే, దన్ పాల్ సుర్యనారాయణ గుప్తా, శ్యాం ఏజెన్సీ సోమనిల సాయంతో బియ్యం, నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ ప్రశాంత్, జవాన్‌లు దుర్గయ్య, శేఖర్లు, శ్రీనగర్ కాలని అద్యక్షులు అంకం లక్ష్మన్, తదితరులు పాల్గొన్నారు.

Tags: muncipal workers, honered, nizamabad, corporator akula hemalatha, corona, virus, sanitary inspector prashanth

Advertisement

Next Story