సూపర్ చాన్స్ కొట్టేసిన నివేద?

by Shyam |
సూపర్ చాన్స్ కొట్టేసిన నివేద?
X

ప్రెట్టీ హీరోయిన్ నివేదా థామస్ తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి నాలుగేళ్లు అయింది. చాలా సెలెక్టివ్‌గా రోల్స్‌ను ఎంచుకుంటూ బెస్ట్ పర్‌ఫార్మర్‌గా పేరు తెచ్చుకుంది. జెంటిల్‌మెన్ నుంచి దర్బార్ వరకు అన్నీ నటనా ప్రాధాన్యమున్న పాత్రలే చేసిన నివేద.. తాజాగా సూపర్ చాన్స్ కొట్టేసినట్లు వార్తలు వస్తున్నాయి.

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ‘సర్కార్ వారి పాట’ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా సెలెక్ట్ అయినట్లు సమాచారం. సినిమాకు కీలకమైన ఈ పాత్రకు నివేద అయితే పూర్తి న్యాయం చేయగలదనే నమ్మకంతో తనను సెలెక్ట్ చేసిందట మూవీ యూనిట్. ఇది కనుక వర్క్‌అవుట్ అయితే నివేద కెరియర్‌కు ఢోకా లేనట్లే. వకీల్ సాబ్‌లోనూ కీలక పాత్రలో కనిపించబోతున్న నివేదకు.. ఈ రెండు సినిమాలు సక్సెస్ అయితే తెలుగులో కెరియర్ గ్రాఫ్ ఓ రేంజ్‌లో ఉంటుందంటున్నారు విశ్లేషకులు.

కాగా పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ‘సర్కార్ వారి పాట’లో కీర్తి సురేశ్ ఫిమేల్ లీడ్ రోల్‌లో కనిపించనుంది.

Advertisement

Next Story