'అక్టోబర్ చివరి నాటికి స్క్రాపేజ్ పాలసీ'

by Harish |
అక్టోబర్ చివరి నాటికి స్క్రాపేజ్ పాలసీ
X

దిశ, వెబ్‌డెస్క్: వాహనాల స్క్రాపేజ్ పాలసీ ఆమోదం చివరి దశలో ఉందని, నెల రోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశముందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఆటోమొబైల్ రంగం వృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. కొద్దిరోజుల్లో ఈ రంగం పుంజుకోవడానికి ఆక్టోబర్ చివరి నాటికి వాహన స్క్రాపేజ్ పాలసీ వస్తుందని గడ్కరీ చెప్పారు.

ఈ పాలసీ వచ్చిన తర్వాత ఆటో రంగం అత్యంత వేగంగా అభివృద్ధి సాధిస్తుందని గడ్కరీ భావించారు. కేంద్ర ప్రభుత్వ విభాగాలు వాహన స్క్రాపేజ్ పాలసీపై అధ్యయనం చేస్తున్నాయని, ఇది వినియోగదారులకు లాభాలుంటాయని, పాత వాహనాలను మార్చుకునే వినియోగదారులకు ప్రోత్సాహకాలు అందుతాయని పేర్కొన్నారు. రానున్న ఐదేళ్లలో భారత్ ఆటోమోటివ్ తయారీ కేంద్రంగా మారడానికి ఈ పాలసీ దోహదపడుతుందని, అలాగే, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలని పరిశ్రమ వర్గాలను కోరారు. అదేవిధంగా, పాత వాహనాల కొనుగోలు వల్ల రీసైక్లింగ్ చేసేందుకు వీలుంటుందని, ముడి విభాగాల దిగుమతి ఖర్చులు తగ్గుతాయన్నారు.

Advertisement

Next Story

Most Viewed