పోలీసులు..మీకు ‘సలామ్’

by Shamantha N |
పోలీసులు..మీకు ‘సలామ్’
X

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో నష్టపోయిన బాధిత కుటుంబాలకు నిర్మల్ జిల్లా పోలీసు యంత్రాంగం అండగా నిలిచింది. జిల్లా ఎస్పీ శశిధర్ రాజు ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రైస్ మిల్లర్లతో కలిసి బాధిత కుటుంబాలకు బియ్యం అందజేయాలని నిర్ణయించారు. ఈ మేరకు పట్టణంలోని రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు పోలీసులకు సహకరించారు. సుమారు10 క్వింటాళ్ల బియ్యాన్ని బాధితుల కోసం సమకూర్చారు. ఈ బియ్యాన్ని ఎస్పీ శశిధర్ రాజు ప్రత్యేక వాహనంలో బైంసాకు తరలించి బాధిత కుటుంబాలకు అందేలా చర్యలు తీసుకున్నారు. అల్లర్లలో సర్వం కోల్పొయిన వారికి నిర్మల్ పోలీసులు అండగా నిలవడంతో ప్రతిఒక్కరూ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు.ఈ కార్యక్రమంలో సీఐలు జాన్ దివాకర్, జీవన్‌రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story