జాతీయ షూటింగ్ పోటీల్లో నాలుగో స్థానం

by Shyam |
జాతీయ షూటింగ్ పోటీల్లో నాలుగో స్థానం
X

ఈ నెల 15న హైదరాబాద్‌లో నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన జాతీయ స్థాయి షూటింగ్ పోటీల్లో నిర్మల్‌కు చెందిన నల్ల వికాస్ రెడ్డి ఉత్తమ ప్రతిభ కనబర్చారు. 16 రాష్ట్రాల నుంచి వందకు పైగా క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీల్లో.. వికాస్ నాలుగో స్థానం సాధించడం విశేషం. కాగా, లక్ష్మణచాందా మండలం వడ్యాల్ గ్రామానికి చెందిన వికాస్‌.. ఉత్తమ ప్రతిభ కనబర్చి జిల్లాకు పేరు తీసుకురావడం పట్ల నిర్మల్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story