కందులా.. సర్కారు ఉందిలే!

by Shyam |
కందులా.. సర్కారు ఉందిలే!
X

రాష్ట్రంలో ఈసారి కంది పంట పండించే రైతులెవరూ ఆందోళన చెందవద్దని ప్రభుత్వమే కందుల కొనుగోళ్లు చేపడుతుందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. కందుల కొనుగోళ్ల వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై 200 కోట్ల రూపాయల అదనపు భారం పడుతోందని చెప్పారు. పండించిన పంటను అమ్ముకోవడంపై రాష్ట్రంలోని కంది రైతుల ఆవేదనను తెలిపిన వెంటనే సీఎం కేసీఆర్ అభయమిచ్చారని ఆయన వెల్లడించారు. రైతుల ఆదాయం 2022కల్లా రెట్టింపు చేస్తామని ప్రగల్బాలు పలికే కేంద్రం మాత్రం కేవలం 47,500 క్వింటాళ్ల కంది కొనుగోలుకు మాత్రమే అనుమతిచ్చిందని విమర్శించారు. సోమవారం సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా బంజారాహిల్స్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో నిరంజన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ కృషి వల్లే కృష్ణా, గోదావరి జలాలు బీళ్లకు మళ్లుతున్నాయని కీర్తించారు. రాష్ట్రంలో ఖరీఫ్‌లో ఈసారి 41 లక్షల ఎకరాల్లో వరి, 5 లక్షల ఎకరాల్లో కంది పంట సాగయిందని తెలిపారు. రాష్ట్రంలోని కందిపంట దిగుబడిపై తమ వద్ద కచ్చితమైన సమాచారం ఉందన్నారు. ఎవరైనా ఇతర రాష్ట్రాల నుంచి కందులు తెచ్చి ఇక్కడ అమ్మితే కేసులు పెడతామని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed