సెర్బియా ఓపెన్ గెలిచిన సరీన్

by Shyam |
Nihal Sareen
X

దిశ, స్పోర్ట్స్: భారత్‌కు చెందిన చెస్ ప్లేయర్ నిహాల్ సరీన్ (16) సెర్బియా ఓపెన్ టైటిల్ వరుసగా రెండో సారి గెలిచి రికార్డు సృష్టించాడు. 7.5 పాయింట్లతో నిహాల్ సెర్బియా ఓపెన్ గెలిచాడని.. ప్రస్తుతం అతడు 2655 లైవ్ రేటింగ్ పాయింట్లతో ఫిడే వరల్డ్ టాప్ 100 లోకి ప్రవేశించినట్లు చెస్ ఇండియా ట్వీట్ చేసింది. అలాగే 14 ఏళ్ల ఆదిత్య మిట్టల్ తొలిసారి గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచాడు. సెర్బిన్ ఓపెన్‌లో 7 పాయింట్లు సాధించి వరుసగా మూడు విజయాలతో టైటిల్ గెలిచాడు. కాగా, ఇది ఆదిత్యకు తొలి గ్రాండ్‌మాస్టర్ టైటిల్ కావడం విశేషం. గత నెలలో 12 ఏళ్ల అభిమన్యు మిశ్ర అతి చిన్న వయసులో గ్రాండ్ మాస్టర్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించాడు. 2500 ఎలో రేటింగ్ సాధించి అతడు బుడాపెస్ట్‌లో గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించాడు.

Advertisement

Next Story