ప్రజలను ఆదుకోలేని స్టార్స్ ఎందుకు? : Nidhi Agarwal

by Shyam |   ( Updated:2021-06-18 03:39:46.0  )
ప్రజలను ఆదుకోలేని స్టార్స్ ఎందుకు? : Nidhi Agarwal
X

దిశ, సినిమా : కరోనా క్లిష్ట పరిస్థితుల్లో పబ్లిక్ ఫిగర్స్ సాధారణ ప్రజలను ఆదుకోకపోతే ఎలా? ఎవరికి తోచిన సాయం వారు చేస్తే బాగుటుందని చెబుతోంది నటి నిధి అగర్వాల్. ‘డిస్ట్రిబ్యూట్ లవ్’ స్వచ్ఛంధ సంస్థ స్థాపించి కొవిడ్ బాధితులకు సహాయం చేస్తున్న ఆమె.. సెకండ్ వేవ్‌లో బాధితులను చూసి తట్టుకోలేక సహాయం చేసేందుకు ముందుకు వచ్చానని తెలిపింది. సాధారణంగా జనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారి చుట్టూ ఉంటూ హెల్ప్ చేయొచ్చు.. కానీ కొవిడ్ పాజిటివ్ వచ్చిన పేషెంట్ ఎంత అనారోగ్యంగా ఉన్నా దూరంగా ఉంటూనే సహాయం చేయగలమని.. ఆ పాయింట్ తనను కదిలించిందని చెప్పింది నిధి. ఇక కొవిడ్ బారినపడిన కొంతమందికి ఎవరు హెల్ప్ చేయని పరిస్థితులు నెలకొన్నాయని, వారు బయటకు వెళ్లి కావాల్సిన సరుకులు కొనుక్కోలేని సిట్యుయేషన్స్ ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అలాంటి వారు ‘డిస్ట్రిబ్యూట్ లవ్’‌లో రిజిస్టర్ చేసుకుని, రిక్వైర్‌మెంట్స్ నమోదు చేస్తే తమ టీమ్ నిత్యవసర వస్తువులు అందిస్తుందని.. ఇప్పటి వరకు సంస్థ పనులన్నీ తానే చూసుకుంటున్నానని, పరిస్థితులను బట్టి భవిష్యత్తులో ఫండ్ రేజ్ చేసే అవకాశం ఉంటుందని వివరించింది. ఇక 24 గంటలు పనిచేస్తున్న ‘డిస్ట్రిబ్యూట్ లవ్’ టీమ్‌ను అభినందించింది అగర్వాల్.

Advertisement

Next Story