- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇవి పేర్లు కాదు.. ఒకప్పుడు మనలో ఒకరు
అమెరికా ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా జనాలు కరోనాను చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. ఇప్పటికే మరణాల సంఖ్య లక్ష దాటినప్పటికీ సామాజిక దూరం పాటించకుండా, పార్టీలు చేసుకుంటూ, మాస్క్‌లు లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నారు. దీంతో ఈ విషయాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మీడియా తనవంతు ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే చాలా రకాలుగా చెప్పి చూసింది. అయినప్పటికీ మార్పు రాకపోవడంతో ‘ది న్యూయార్క్ టైమ్స్’ పత్రిక ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఇప్పుడు అమెరికాలో కరోనా విజృంభణ పరిస్థితికి అద్దం పడుతుంది. ఇంతకీ ఏం చేసిందో తెలుసా?
ఏ పత్రికకైనా మొదటి పేజీనే కీలకం. చాలా ప్రాముఖ్యమున్న వార్తలే మొదటి పేజీలో ప్రచురిస్తారు. అలాంటి మొదటి పేజీని ఆదివారం రోజున ‘ది న్యూయార్క్ టైమ్స్’ పత్రిక కరోనా మృతుల పేర్లతో నింపేసింది. వీళ్లంతా అమెరికా వ్యాప్తంగా కరోనా బారిన పడి చనిపోయినవాళ్లే! కేవలం మొదటి పేజీ మాత్రమే కాదు, వరుసగా లోపలి రెండు పేజీల్లోనూ వారి పేర్లే ఉన్నాయి. అన్ని పేర్లు కలిపితే దాదాపు 1000 మందికి పైగా ఉన్నారు. అంటే లక్షలో ఈ పేర్లు కేవలం 1 శాతమే. ఒక శాతం పేర్లకే రెండు మూడు పేజీలు నిండితే, మొత్తం పేర్లు నిండితే ఎన్ని పేజీలు కావాలో అనే ఆలోచన వల్ల ఒకలాంటి భయం అక్కడి ప్రజల్లో వచ్చింది. “ఇవి పేర్లు మాత్రమే కాదు, ఒకప్పుడు మనలో ఒకరు” అనే క్యాప్షన్‌తో న్యూయార్క్ టైమ్స్ ఇలా ప్రచురించడాన్ని అందరూ తమ ట్వీట్లతో మెచ్చుకున్నారు.