నేషనల్ అవార్డ్ గెలుపొందాకే నయన్ పెళ్లి?

by Jakkula Samataha |
నేషనల్ అవార్డ్ గెలుపొందాకే నయన్ పెళ్లి?
X

దిశ, వెబ్‌డెస్క్: లేడీ సూపర్‌స్టార్ నయనతార, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ప్రేమాయణం గురించి ప్రతీ ఒక్కరికి తెలుసు. కానీ పెళ్లి ఎప్పుడు? ఎక్కడ? అనేది మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయలేక పోతున్నారు.? కరోనా టైమ్‌లోనే ఓ గుడిలో పెళ్లి జరగబోతోందని కొంత ప్రచారం జరగ్గా.. కరోనా పరిస్థితులు సాధారణం కాగానే వివాహం ఉండబోతుందని మరికొందరు అన్నారు. మళ్లీ ఇప్పుడు ఓ కొత్త రూమర్ స్ప్రెడ్ అయింది. అదేంటంటే నయన్, శివన్‌ల పెళ్లి.. నయన్ నేషనల్ అవార్డు విన్ అయ్యాకే అని. నయన్ జాతీయ ఉత్తమ నటి పురస్కారం అందుకోగానే.. వివాహ మహోత్సవం ఉండబోతుందని అనుకుంటున్నారు.

కాగా ‘అరమ్మ్’ సినిమాకే నయన్ బెస్ట్ ఫిమేల్ యాక్టర్‌గా నేషనల్ అవార్డ్ అందుకుంటుందని అభిమానులు భావించినా కుదరలేదు. ఈ సినిమాలో తను కలెక్టర్ కాగా, బోరు బావిలో పడిన పిల్లాడిని కాపాడేందుకు ప్రయత్నించిన కలెక్టర్ పాత్రలో జీవించి మన్ననలు అందుకుంది. లేడీ సూపర్ స్టార్ జాతీయ ఉత్తమ నటి అవార్డుకు అర్హురాలని.. కచ్చితంగా అందుకుంటుందని అంతా అనుకున్నారు.

కాగా, నయన్ ‘మూకుతి అమ్మన్, అన్నాత్తే’ సినిమాతో పాటు శివన్ డైరెక్షన్‌లో వస్తున్న ‘కాతు వాకుల రెండు కాదల్’ సినిమా చేస్తోంది. విజయ్ సేతుపతి హీరోగా వస్తున్న ఈ సినిమాలో సమంత అక్కినేని కూడా నటిస్తోంది.

Advertisement

Next Story