ఏపీలో తాజాగా 80 పాజిటివ్ కేసులు

by srinivas |
ఏపీలో తాజాగా 80 పాజిటివ్ కేసులు
X

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. సోమవారం కొత్తగా 80 కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తంగా 1,177కు చేరాయి. ఇప్పటివరకూ రాష్ర్టవ్యాప్తంగా 31 మంది ఈ వైరస్ మూలంగా మృతిచెందారు. కరోనా నుంచి కోలుకుని 235 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 911 యాక్టివ్ కేసులు చికిత్స పొందుతున్నాయి. అత్యధికంగా కర్నూలులో-292, గుంటూరులో-237, కృష్ణాజిల్లా-210 కేసులు నమోదు అయ్యాయి.

Tags: 80 positive cases, AP, corona, Yesterday, kurnool, guntur, krishna

Advertisement

Next Story