- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గాంధారిలో అమానుషం.. అప్పుడే పుట్టిన శిశువు ముళ్లపొదల్లో లభ్యం
దిశ, గాంధారి: మానవత్వం మంటగలిసిపోతోంది అనడానికి ఇదే నిదర్శనం. ఏమాత్రం కనికరం లేకుండా అప్పుడే పుట్టిన మగ శిశువును ముళ్లపొదల్లో పడేశారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండలం బిర్మల్‌తండా గ్రామంలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామంలోని దుర్గం చెరువు వద్ద ముళ్లపొదల్లో స్థానికులకు అప్పుడే పుట్టిన మగ శిశువు లభ్యమైంది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న గాంధారి ఎస్ఐ, జిల్లా చైల్డ్ వేల్ఫేర్ అధికారి సరస్వతి శిశువును కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో శిశువును పరీక్షించిన డాక్టర్ శ్రీనివాస్ ప్రస్తుతం అబ్జర్వేషన్‌లో ఉంచారు. తండా వాసుల సమాచారం ప్రకారం.. శిశువు తల్లి అవివాహిత కావడంతో పసికందును ముళ్లపొదల్లో పడేసి తాను బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నదని చెబుతున్నారు. తల్లి మృతి చెందిందా? లేదా? అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న ఎస్ దర్యాప్తు ప్రారంభించారు.