ప్రేమ జంట కేసులో ట్విస్ట్.. యువతి స్నేహితులే..

by srinivas |   ( Updated:2021-07-07 05:26:45.0  )
ప్రేమ జంట కేసులో ట్విస్ట్.. యువతి స్నేహితులే..
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో సంచలనం సృష్టించిన గూడూరు పట్టణంలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. ప్రియురాలు దూరం పెడుతుందన్న ఆక్రోశంతోనేఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు పోలీసులు తేల్చారు. తేజస్విని దూరం పెట్టడాన్ని తట్టుకోలేక పోవడంతో వెంకటేశ్‌ ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడని ఏఎస్పీ వెంకటరత్నం బుధవారం మీడియాకు వివరించారు.

తేజస్విని, వెంకటేశ్ ఇద్దరూ ప్రేమించుకున్నారని అయితే రెండు నెలలుగా విభేదాలు వచ్చినట్లు తమ విచారణలో తేలిందన్నారు. దీంతో వెంకటేశ్‌ను తేజస్విని దూరం పెట్టిందని అది తట్టుకోలేని వెంకటేశ్ ఆమెను హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించినట్లు విచారణలో అంగీకరించాడని తెలిపారు. హత్యకు తేజస్విని క్లాస్ మేట్ శివ, స్నేహితుడు పృథ్విరాజ్‌లు సహకరించారని తెలిపారు. పథకం ప్రకారం ఇంటిలోకి చొరపడి తేజస్వినిని హత్యచేసిన వెంకటేశ్ అనంతరం ఆత్మహత్యా ప్రయత్నం చేశాడన్నారు. వెంకటేష్ ,పృథ్విరాజ్ ,శివలను అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ తెలిపారు. హత్యకు ఉపయోగించిన కత్తి, బైక్, మూడు సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని మీడియాకు తెలిపారు.

Advertisement

Next Story