సంక్షేమ పథకాలకు కొత్త రూల్స్.. ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

by Anukaran |   ( Updated:2021-08-25 11:41:51.0  )
jagan-cm
X

దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. పెన్షన్, రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీకార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు 21 రోజుల్లో వారి అర్హతను నిర్ధారించాలని సూచించారు. అర్హత సాధించిన వారికి 90 రోజుల్లోగా వాటిని శాంక్షన్‌ చేయాలి. ఏడాదికి 4 సార్లు ఇలా శాంక్షన్లు వస్తాయి’ అని సీఎం జగన్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా అనేక పథకాలను అమలు చేస్తోంది. ‘ఇళ్లపట్టాలతోపాటు, నేతన్న నేస్తం, చేయూత, మత్స్య భరోసా తదితర పథకాలను అమలు చేస్తోంది.

పథకాన్ని అమలు చేసినప్పుడు ఎవరైనా మిగిలిపోతే వారిని దరఖాస్తు చేసుకోమని చెప్తున్నాం. ఈ జాబితాల్లో కూడా 90 రోజుల్లోగా అర్హతలను నిర్ధారించి, అర్హులైన వారికి 6 నెలల్లోగా శాంక్షన్లు ఇవ్వాలి. దీనివల్ల ప్రజలకు వ్యవస్థలపై విశ్వాసం కలుగుతుందని సీఎం జగన్ తెలిపారు. లబ్ధిదారులకు పథకం ప్రయోజనాలు చేరిన తర్వాత వాలంటీర్‌తో కలిసి వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ లబ్ధిదారుని వద్దకు వెల్లి డిజిటల్‌ అకాలెడ్జ్‌తోమెంట్‌తోపాటు, భౌతికంగా రశీదు కూడా ఇవ్వాలని సీఎం సూచించారు.

Advertisement

Next Story