- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘గమ్చా’ చాలెంజ్ ట్రై చేశారా?
దిశ వెబ్ డెస్క్ : లాక్‌డౌన్ సమయంలో రకరకాల చాలెంజ్ లు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. రోజుకో కొత్త చాలెంజ్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. లాక్ డౌన్ కారణంగా ఇంట్లో ఉండటంతో.. నెటిజన్లు కూడా వీటిని బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. అదే క్రమంలో ప్రస్తుతం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో మరో కొత్త ఛాలెంజ్ వచ్చింది. అదే ‘గమ్చా ’చాలెంజ్. నెటిజన్లు అధికంగా ఇష్టపడుతున్న ఈ చాలెంజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.
ట్రెడిషనల్ సారీ వేర్ చాలెంజ్ ఇటీవలే బాగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత కపుల్ చాలెంజ్, సిల్లీ ఫోటో చాలెంజ్, టీషర్ట్ చాలెంజ్ లు ఆన్ లైన్ వేదికగా వైరల్ అయ్యాయి. లాక్ డౌన్ తో ప్రజలంతా ఇంటికే పరిమితం కావడంతో సోషల్ మీడియాలో ఎక్కువగా సమయం గడుపుతున్నారు. దాంతో ఏ కొత్త చాలెంజ్ కనిపించినా పొలోమంటూ ఫాలో అయిపోతున్నారు. ఇటీవల ‘గమ్చా’ చాలెంజ్ అదే విధంగా ట్రెండ్ అవుతోంది. నెట్టింట్లో గడిపేవాళ్లకు ఈపాటికే దీని గురించి తెలిసే ఉంటుంది. ‘గమ్చా’ అంటే హిందీలో టవల్ లేదా వస్త్రం అని అర్థం. దీని సహాయంతో ముఖాన్ని కప్పుకోవాలి. అది కూడా చాలా కట్టుదిట్టంగా ఊడిపోకుండా కట్టుకోవాలి. ఇందులో రూల్ ఏంటంటే కళ్లు మాత్రమే కనిపించాలి. ముక్కు కొంచెం కూడా కన్పించకూడదు. గమ్చా కట్టుకుని ఫొటో దిగి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. ఈ చాలెంజ్ ఇప్పటి పరిస్థితులకు బాగా సూట్ అవుతుంది. ఎందుకంటే.. బయటకు వెళితే.. మాస్క్ మస్ట్ అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. మాస్క్ ఇంట్లో చేసిందైనా పర్వాలేదంటూ సూచించాయి. గమ్చా చాలెంజ్ ఫోటోలకే పరిమితం కాకుండా బయటకు వెళ్లినప్పుడు కూడా ఫాలో అయితే .. అంతకన్నా మంచి మాస్క్ అవసరం ఉండదు కదా! అయితే గమ్చా చాలెంజ్ లో కొందరు కేవలం ‘పట్కా’లా కూడా కట్టుకుంటున్నారు.
Tags : lockdown, gamcha, viral, challenge