- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మందు బాబులకు షాక్.. 45 రోజులు వైన్ షాపులు బంద్
దిశ, డైనమిక్ బ్యూరో: రెండు మూడు రోజులు వైన్సులు బంద్ ఉంటేనే మందుబాబులు లైన్ కట్టేస్తుంటారు. అదే.. ఏకంగా 45 రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ ఉంటే మందు బాబుల పరిస్థితి ఏంటో అని ఉంహించుకొంటూనే భయమేస్తుంది కదా..?. ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 1 నుంచి 45 రోజుల పాటు మద్యం దుకాణాలను మూసేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించింది. నూతన మద్యం పాలసీని తీసుకొస్తున్నందున ఢిల్లీలోని ప్రైవేటు వైన్స్ దుకాణాలు సెప్టెంబర్ 30 తర్వాత మూత పడనున్నాయి. ఈ క్రమంలో 260 ప్రైవేటు వైన్స్ షాపు లకు ఇప్పటికే ప్రభుత్వం నోటీసులు పంపించింది. ప్రస్తుతం ఢిల్లీలో 849 వైన్స్ లు ఉండగా ప్రభుత్వ ఆధీనంలోనే మూడో వంతు వైన్సులు నడుస్తున్నాయి. దీంతో ఇంకా వారం రోజులే ఉండటంతో మందు బాబులు మద్యం కొనేందుకు వైన్స్ ల ముందు క్యూ కడుతున్నారు.